రోడ్ల నిర్మాణం, బ్రిడ్జీలు, టవర్లు కూడా: మారని చైనా తీరు
తూర్పు లడాఖ్ వద్ద చైనా దుందుకుడు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్యొంగ్యాంగ్ టీఎస్‌వో నుంచి రవాణా కోసం భారీ రహదారులను వేస్తోంది. దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజేస్‌ను ఇండియా టుడే విడుదల చేసింది. ఆ రహదారులు పీఎల్ఏకు అనుసంధానిస్తాయట. రుటాగ్ సమీపంలోనే ఈ రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి.
రోడ్స్ కాదు కొత్తగా టవర్లు కూడా ఏర్పాటు చేసింది. చాలా చోట్ల ఆ టవర్స్ కనిపిస్తున్నాయి. కొత్తగా బ్రిడ్జీలను కూడా నిర్మిస్తున్నాయి. రెండేళ్ల క్రితం భారత సైన్యానికి, చైనా ఆర్మీకి ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇటు సరస్సుపై నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న రోడ్డుకు అనుసంధానంగా పనులు జరుగుతున్నాయి.

ఇటీవల డెమ్ చోక్ వద్ద భారతీయ గ్రేజియర్లను ముందుకు వెళ్లనీయని సంగతి తెలిసిందే. డెమ్ చోక్‌లో గల సీఎన్ఎన్ జంక్షన్‌లో ఉన్న సాడిల్ పాస్ సమీపంలో గల ఎల్ఏసీలో భారతీయ గ్రేజియర్లు ఉన్నారు. అయితే చైనా దళాలు తమ ఉనికి చాటుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధం లేకున్నా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications