అమెరికా ఆధీనంలోని ఇరాక్ ఎయిర్‌బేస్‌పై రాకెట్ దాడులు, నలుగురికి గాయాలు
ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా మట్టుబెట్టాక మధ్య ప్రాచ్యలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం తమ విమానాన్ని ఇరాన్ మిలిటరీ.. శత్రువుల విమానం అనుకొని కూల్చివేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఇరాక్ ఎయిర్‌బేస్‌పై రాకెట్ ప్రయోగం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న ఆల్ బసద్ ఎయిర్‌బేస్ అమెరికా ఆధీనంలో ఉంది. దీని లక్ష్యంగా ఆదివారం ఎనిమిది రాకెట్లతో దాడి చేశారు. నలుగురు గాయపడ్డారని.. అందులో ఇద్దరు ఇరాకీ అధికారులు అని, ఇద్దరు ఎయిర్‌మెన్లు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆల్ బసద్ ఎయిర్‌బేస్‌లో ఎఫ్-16 విమానాలకు స్థావరం.. అంతేకాదు ఇక్కడినుంచి అమెరికా తన ఆపరేషన్లను నిర్వహిస్తోంది. అయితే గత రెండువారాలుగా ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.
ఎయిర్‌బేస్ దాడులు చేస్తారనే హెచ్చరికల నేపథ్యంలో 90 శాతం అమెరికాకు చెందిన వాయుసేన నిర్వహణకు సంబంధించి సలహాదారులు, ఉద్యోగులను పంపించివేశారు. అంతేకాదు 15 మంది అమెరికా సైనికులు, విమానం కూడా ఇక్కడ లేదని పేర్కొన్నది.
Recommended Video
అంతేకాదు అమెరికా దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు ఇటీవల రాకెట్, మోర్టార్ దాడులకు కూడా గురయ్యాయి. ఇరాకీ దళాలను టార్గెట్‌గా దాడి చేశాయి. గత నెలలో అమెరికా కాంట్రాక్టర్‌ను కూడా మట్టుబెట్టాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications