రహస్య ప్రియుడి పోలికలతో పుట్టాడని బిడ్డను చంపేసింది

బుకారెస్ట్: రోమేనియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవమోసాలు మోసిన కన్నతల్లే అతికిరాతకంగా ఆ బిడ్డను చంపేసింది. తనకు పుట్టిన పాప తన మిగితా పిల్లలకు భిన్నంగా, తన మాజీ ప్రియుడి పోలికలతో ఉందనే కారణంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.

వివరాల్లోకి వెళితే.. తూర్పు రోమేనియాలోని బర్లాడ్‌కు చెందిన ఎలీనా స్కోకట్(27) అనే మహిళలకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, ఎలీనా దంపతులకు మరో మగ పిల్లాడు ఇటీవల జన్మించాడు. అయితే, ఆ పుట్టిన పిల్లాడి పోలికలు మిగితా పిల్లల పోలికల కంటే భిన్నంగా ఉండటంతో ఎలీనాలో అనుమానం మొదలైంది.

తనతో అక్రమ సంబంధం ఉన్న రహస్య ప్రియుడి పోలికలు ఆ అబ్బాయిలో ఉండటాన్ని గమనించిన ఆమె.. ఎక్కడ గుట్టు భయటపడుతుందేమోనని పైశాచికానికి తెగబడింది. 9నెలలు మోసి కన్న ఆ పసిపాపను నేలకేసి కొట్టింది. అంతటితో ఆగకుండా పలక ముక్కలతో తీవ్రంగా కొట్టి చంపేసింది. ఆ తర్వాత అబ్బాయి మృతదేహాన్ని బాత్ టబ్‌లో దాచింది.

Romanian Woman Cruelly Murders Baby For Shocking Reason

కాగా, ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ఆమె మరో ఇద్దరు పిల్లలు.. ఇరుగుపొరుగువారికి విషయం చెప్పారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృత బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు మాట్లాడుతూ.. ఎలీనా ఈ హత్యను ఉద్దేశపూర్వకంగానే చేసిందని, ఈ హత్య చేస్తున్నప్పుడు ఆమె తెలివితోనే ఉందని చెప్పారు. కాగా, కోర్టు ఎలీనాకు 18ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+