లైటర్‌తో నిప్పంటించి: ప్రియురాలి అతిక్రూరమైన హత్య
రోమ్: తనకు దూరమైందనే కోపంతో రోమ్ వర్సిటీ విద్యార్థినిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపేశాడు. ఇది తమ కెరీర్లోనే అతి క్రూరమైన హత్య అని పోలీసులు చెబుతున్నారు. రోమ్ వర్సిటీ విద్యార్థిని యువతి సారా డీ పీట్రంటోనియా, ప్రియుడు విన్కెంజో పడానో ప్రేమించుకున్నారు.
అయితే, కొద్ది రోజులుగా విన్కెంజోకు సారా దూరమైంది. దీనిని భరించలేక విన్కెంజో ఆమె పైన పగ పెంచుకున్నాడు. సారా వెళ్తున్న కారును ఆపి నిప్పు పెట్టాడు. ఆమె కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా.. విన్కెంజో ఆమెను వెంటాడి సజీవదహనం చేశాడు.

ఆమె ముఖం పైన, శరీరం పైన ఆల్కాహాల్ పోసి లైటర్‌తో నిప్పు అంటించి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల దర్యాఫ్తులో తనకు ఏం తెలియదని బుకాయించాడు. అయితే, సీసీ కెమెరాల్లో అదంతా నిక్షిప్తమై ఉంది. దీంతో విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications