రాయల్ వెడ్డింగ్: ఘనంగా ప్రిన్స్ హ్యారీ-మేఘన్ పెళ్లి, మెరిసిన ప్రియాంక
Recommended Video

లండన్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొన్న క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ల వివాహం ఘనంగా జరిగింది. లండన్ సమీపంలోని విండ్సర్ క్యాసిల్‌లోని చర్చిలో వీరి వివాహం వందలాది ప్రముఖుల మధ్య జరిగింది. ముసిముసి నవ్వులతో ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు.

పెళ్లి సంబరాలు
మేఘన్, ప్రిన్స్‌లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు. విండ్సర్ క్యాజిల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చాపెల్ వెలుపల సంబరాలు ప్రారంభమయ్యాయి.

స్వాగతం పలికారు
అందకుముందు ప్రిన్స్‌ను వివాహమాడేందుకు మేఘన్ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చుని స్వాగతం పలికారు. ఈ వివాహ వేడుకకు భారీ ఎత్తున అతిథులు హాజరయ్యారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతోపాటు ఇతర ప్రముఖులు డేవిడ్, విక్టోరియా బెక్హామ్, జార్జ్, అమల్, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.

వధువుతో ప్రిన్స్ చార్లెస్
మేఘన్ మెర్కెల్.. బ్రిటీష్ డిజైనర్ క్లేర్ వెయిట్ కెల్లర్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించి మెరిసిపోయారు. రాయల్ వెడ్డింగ్‌కు వధువు మేఘన్ తండ్రి థామస్ రాలేకపోవడంతో.. ప్రిన్స్ చార్లెస్ ఆమెకు తండ్రిగా విండ్సర్ క్యాజిలోకి తీసుకొచ్చారు. ప్రిన్స్ హ్యారీ రింగ్ ప్లాటినం బాండ్‌తో ఉండగా, మేఘన్ వెడ్డింగ్ రింగ్ వెల్ష్ గోల్డ్‌తో రూపొందించినట్లు కెన్సింగ్టన్ ప్యాలెస్ చెప్పింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కిల్‌కు బ్రిటన్ ప్రధాని థెరీసా మే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మెరిసిన ప్రియాంక
కాగా, తనకు అందిన ఆహ్వానం మేరకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రాయల్ వెడ్డింగ్ డ్రెస్‌లో, క్లాసీ హ్యాట్ ధరించిన ప్రియాంక తళుక్కున మెరిశారు. ఆమెతపాటో మేఘన్ స్నేహితులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పెళ్లి సరిసరాల్లో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రేమ వివాహమే..
కాగా, ప్రియాంక, మేఘన్ గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులు. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేఘన్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రియాంక చెప్పడం గమనార్హం. ఈ వివాహం వారి జీవితాల్లో మరింత ఆనందాన్ని నింపబోతోందని వ్యాఖ్యానించారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications