వీరి ప్రేమే ఓ సంచలనం: ప్రిన్స్ హెన్రీ-మేఘన్‌ల పెళ్లి డేట్ ఇదే
లండన్: బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు వివాహం చేసుకోబోతున్నారు. విండ్సర్ క్యాస్టల్‌లోని సెయింట్ జార్జ్స్ చాపెల్‌లో వీరి వివాహం ఘనంగా జరగనుంది.
ఈ జంట నిశ్చితార్థం జరిపించామని హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇప్పటికే వెల్లడించారు. మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

మేఘన్ సంచలనమే..
బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్‌కు అంతర్జాతీయ మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఏకంగా 2016 ఏడాదికి గానూ మోస్ట్ సెర్చ్‌డ్ నటిగా మేఘన్ రికార్డు సృష్టించింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు.

ప్రేమించుకుంటున్నాం..
‘మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' హెన్రీతో తన ప్రేమ విషయాన్ని నటి మేఘన్ ఇటీవల బహిర్గత పరిచింది.

అలా పరిచయం.. సాన్నిహిత్యం
గత సంవత్సరం జులై నెలలో ‘సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరిద్దరి పరిచయం జరిగింది. అక్కడే వీరి తొలి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది.

అంతకుముందే విడాకులు..
నిర్మాత ట్రెవర్ ఇంగెల్సన్‌తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో పరిచయం.. ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లికి దారి తీయడం గమనార్హం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications