పాక్ రూపాయి 'ఢమాల్':భారీ పతనం.. తొమ్మిదేళ్లలో అత్యంత కనిష్టం..
ఇంట్రా బ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపునకు సెంట్రల్ బ్యాంకు ఈ డీవాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ తెలిపారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూనే ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో గత తొమ్మిదేళ్లలో రూపాయి విలువ అత్యంత భారీగా పతనమైంది. డాలర్ తో ప్రస్తుతం పాక్ రూపాయి మారకం విలువ 3.1శాతం మేర పడిపోయి 108.1గా నమోదైంది.
రూపాయి విలువ పతనం అక్కడి కేంద్ర బ్యాంకు వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందుగా దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తనుందన్న సంకేతాల నేపథ్యంలో.. రూపాయి విలువను కేంద్ర బ్యాంకే డీవాల్యుయేట్ చేయడానికి అనుమతినిచ్చింది. దీంతో 2013డిసెంబర్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ చేరుకుంది.

ఇంట్రా బ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపునకు సెంట్రల్ బ్యాంకు ఈ డీవాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ తెలిపారు. తద్వారా పేరుకుపోతున్న లోటును తగ్గించవచ్చునని కేంద్రబ్యాంకు భావిస్తోంది. దీనికి తోడు ఎగమతులు కూడా ఊపందుకుంటాయని చూస్తోంది.
కాగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పాకిస్తాన్ వాణిజ్య లోపు 60శాతం పెరగడం గమనార్హం. మే నెలతో ముగిసిన 11నెలల కాలంలో పాకిస్తాన్ ప్రస్తుత వాణిజ్య లోటు మరో రెండింతలు పెరిగి 8,9బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి బలం చేకూర్చడంతో ప్రస్తుత లోటును తగ్గించవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు.
-
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications