రూపాయి పతనంతో ఆనందం: మనదేశానికి భారీగా డబ్బులు పంపిస్తున్నారు!
న్యూఢిల్లీ: రూపాయి మారకం రోజు రోజుకు పడిపోతుండటంపై మనదేశంలో ఆందోళన వ్యక్తమవుతుంటే విదేశాల్లోని భారతీయులకు మాత్రం ఆనందం కలిగిస్తోంది. అందుకే డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో విదేశాల్లోని భారతీయులు క్యాష్ చేసుకుంటున్నారు.

రూపాయం పతనంలో పెరిగిన జీతం మొత్తం
దిర్హమ్‌ల రూపంలో అందుకునే జీతంలో ఎలాంటి తేడా లేకపోయినప్పటికీ భారతీయులు యూఏఈలో తీసుకునే జీతం మొత్తం మాత్రం గత ఏడాది కంటే 10శాతం పెరగడం గమనార్హం. రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడంతో వారం రోజులకోసారి మనీ ఎక్ఛేంజీ కేంద్రాల ద్వారా విదేశాల్లోని భారతీయులు తమ స్వస్థలాలకు ఎక్కువ డబ్బును పంపించేస్తున్నారు.

భారీగా డబ్బు పంపిస్తున్నారు..
కాగా, బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.66గా కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ పడిపోవడాన్ని విదేశాల్లోని భారతీయులు తమకు అనుకూలంగా మార్చుకుని తమ ఇళ్లకు ఎక్కువ డబ్బును పంపించేస్తున్నారు. గురువారం ఒక రూపాయికి 19.3 దిర్హమ్‌లు ట్రేడవుతోంది.

వచ్చే డబ్బులు పెరిగాయి..
రూపాయి విలువ పతనం ఇండియాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపించేందుకు వీలుగా మారిందని యూఏఈలో హోటల్ మేనేజర్‌గా పనిస్తున్న ఫైజల్ జురానీ తెలిపారు. దుబాయి మాల్‌లో రూపాయి మారకంను ఎప్పుటికప్పుడు గమనిస్తూ డబ్బును పంపించేస్తున్నట్లు తెలిపారు. దిర్హమ్‌కు వచ్చే రూపాయల మొత్తం పెరిగిందని చెబుతున్నారు.

లాభం పొందుతున్నామని ఆనందం
ప్రతి నెల తాను 700దిర్హమ్‌లను ఇండియాలోని తన ఇంటికి పంపించేవాడినని చెప్పిన ఎలక్ట్రిషియన్ అహ్మద్ రెహబా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పంపిస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబం తను పంపించే డబ్బుపైనే ఆధారపడి ఉందని, ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడంతో ఎక్కువ లాభం పొందుతున్నట్లు ఆనందంగా తెలిపారు.

అప్పులు తీరుతున్నాయి..
తాము తీసుకున్న అప్పులు కూడా తీర్చుకునేందుకు సానుకూల వాతావరణ ఏర్పడిందని చెప్పారు. ఎక్కువ మొత్తం రావడంతో అప్పులు తీర్చేస్తున్నామని తెలిపారు. యూఏఈ ఎక్ఛేంజీ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ శెట్టి మాట్లాడుతూ.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇక్కడి భారత ఉద్యోగులు లాభాలు పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా, రూపాయి మారకం పతనమవుతుండటంతో ఇతర దేశాల్లోని భారతీయులు కూడా ఇండియాకు ఎక్కువ మొత్తం డబ్బును పంపించే అవకాశం లభించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications