ఉక్రెయిన్‌పై రష్యా ఫిరంగిదళం దాడి.. 70 మంది సైనికులు మృతి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు ఆంక్షలను కఠినతరం చేసినా.. రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ చుట్టూ తమ బలగాలను మోహరించింది. ఖార్కివ్ సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడులకు పాల్పడింది. దీంతో 70మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారు.
Recommended Video

ఖార్కివ్‌లో బాంబుల మోత
ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు అసంపూర్తిగా మగిసిన నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను మరింత పెంచింది . ఉక్రెయిన్ బలగాలు కూడా రష్యా దళాలను ముందుకు సాగకుండా దీటుగానే ఎదుర్కొంటున్నాయి. అయితే కొన్ని కీలక పట్టణాలను మాత్రం రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్‌కు రెండో అతిపెద్ద నగరం ఖార్వివ్ . ఇక్కడ నివాస ప్రాంతాలపై కూడా మాస్కో బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం

64 కిలోమీటర్ల మేర రష్యా సైనికుల కాన్వాయ్
అటు ఉక్రెయిన్ పై దండయాత్రకు భారీగానే తమ బలగాలను రష్యా దింపింది. కీవ్ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యా సైనికులు మోహరించారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 350 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. యుద్ధంలో భాగంగా జనావాస ప్రాంతాలపై కూడా దాడులకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రష్యా వాక్యూమ్ బాంబ్ ప్రయోగం ?
రష్యా దురాక్రమణకు ప్రపంచ దేశాలు ముక్తం కంఠంతో ఖండిస్తున్నాయి. తమపై వాక్యూమ్ బాంబ్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకరోనా అమెరికా కాంగ్రెస్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్యంసం చేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించింది. జెనీవా కన్ వెక్షన్ నిషేధించిన వాక్యూమ్ బాంబ్ ను తమపై ప్రయోగించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications