రష్యా: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు.. ప్రజలు టీకాలు వేయించుకోకపోవడం వల్లనే అంటున్న ప్రభుత్వం

మాస్కోలో కోవిడ్ సోకిన ఒక రోగిని ఆస్పత్రిలోకి తీసుకెళుతున్న దృశ్యం

రష్యాలో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

గత వారం రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం రష్యన్‌ ప్రజలు టీకాలు తీసుకోకపోవడమే అని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

టీకాలపై అపనమ్మకంతో జనాభాలో మూడో వంతు మంది మాత్రమే వ్యాక్సీన్ తీసుకున్నారు.

రష్యా 2.22 లక్షల కోవిడ్ మరణాలతో యూరప్‌లో అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంగా ఉంది. శనివారం మరో 33 వేల మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.

ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున కఠిన ఆంక్షలను విధించడం లేదని ప్రభుత్వం తెలిపింది.

దీనికి బదులుగా టీకాపై ప్రజలు చూపుతున్న ఉదాసీనతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

"వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో, ప్రజలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి" అని ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు.

"టీకాలు వేసుకోకపోవడం బాధ్యతారాహిత్యం లాంటిది. ఇది ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది" అని ఆయన చెప్పారు.

ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలలేదని, పెరుగుతున్న రోగుల సంఖ్యను తట్టుకోగల శక్తి తమకు ఉందని ప్రభుత్వం చెబుతోంది.

కోవిడ్ భయాల కారణంగా ఆసుపత్రులను వదిలి పెట్టిన వైద్యులు టీకాలు వేయించుకుని తిరిగి పనిలో చేరాలని ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో కోరారు.

రష్యాలో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 7.5 లక్షలుగా ఉంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి రష్యాలో నమోదైన అత్యధిక యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఇదే.

మొత్తం మీద ఇప్పటివరకూ దేశంలో 80 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఒకటి, రెండు డోసుల టీకాలు తీసుకున్న రష్యన్ల సంఖ్య ఆశ్చర్యకరంగా దగ్గర దగ్గరగా ఉన్నాయి. రెండూ కలిపితే జనాభాలో దాదాపు మూడొంతుల మంది కంటే కొంచెం తక్కువ మంది వ్యాక్సీన్ తీసుకున్నారు.

దీన్ని బట్టి పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు వేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణలో 50 శాతం కంటే ఎక్కువ మంది టీకా వేసుకోవడంపై ఆసక్తి చూపించడం లేదని తేలింది.

Click here to see the BBC interactive

వ్యాక్సీన్‌లను అభివృద్ధి చేయడంలో రష్యా ముందే ఉంది. స్పుత్నిక్ వీ టీకాని గతేడాది త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పాటు మరో మూడు వ్యాక్సీన్లను రష్యా ప్రభుత్వం ఆమోదించింది.

కానీ, వ్యాక్సీన్లు నమ్మదగినవని ప్రజలను ఒప్పించడంలో రష్యా విఫలమైనట్లు కనిపిస్తోంది.

స్పుత్నిక్ వీ టీకాను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడంలో రష్యా మరింత విజయాన్ని సాధించింది. ఈ టీకా ఇతర దేశాలకు త్వరగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరఫరా చేయడంలో సమస్యలు తలెత్తాయి. కొన్ని దేశాలకు సకాలంలో టీకా డోసులు అందడం లేదు.

దాదాపు 70 దేశాలు స్పుత్నిక్ వీ టీకా వినియోగానికి ఆమోదం తెలిపాయి. అయితే, రష్యాకు చెందిన ఇతర వ్యాక్సీన్‌ల మాదిరిగానే దీన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఆమోదించలేదు.

రష్యాలో ఇతర అంతర్జాతీయ టీకాలు అందుబాటులో లేకపోవడంతో, కొంతమంది రష్యన్లు టీకా టూర్ ప్యాకేజీలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

సెర్బియాలోకి రష్యన్లు వీసా లేకుండా ప్రవేశించే అవకాశం ఉంది. ఇక్కడకు వచ్చిన సందర్శకులు ఫైజర్ టీకా పొందే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+