రష్యా, చైనాతో బెదిరింపులు: యుద్దానికి సిద్దం: అమెరికా షాకింగ్

న్యూయార్క్: యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ తమ బలగాలను ఆదేశించారు. కొంత కాలంగా చైనా,రష్యాల నుండి బెదిరింపులు వస్తున్నాయని, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన సైన్యానికి తేల్చి చెప్పారు.

అమెరికా ఇటీవల కాలంలో ఉత్తరకొరియాతో యుద్దానికి సిద్దమనే సంకేతాలను పంపింది. ఉత్తరకొరియా వ్యవహరశైలిని తప్పుబడుతూ యుద్దమే శరణ్యమని అభిప్రాయపడింది. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కూడ అమెరికాకు ధీటుగానే సమాధానమిచ్చారు.కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్ శాంతి మంత్రాన్ని పాటిస్తున్నారు.

మరో వైపు తాజాగా రష్యా, చైనాల నుండి వస్తున్న బెదిరింపులను తట్టుకోవడానికి యుద్దం అవసరమని అమెరికా అభిప్రాయపడుతోంది. అమెరికా నుండి వచ్చిన తాజా ప్రకటనపై రష్యా, చైనాలు స్పందించాల్సి ఉంది.

యుద్దానికి సిద్దంగా ఉండాలి

యుద్దానికి సిద్దంగా ఉండాలి

యుద్దానికి సిద్దంగా ఉండాలని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ తమ బలగాలకు స్పష్టం చేశారు. కొంత కాలంగా రష్యా, చైనా నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులు తమ కంటే శక్తిని పెంచుకొంటున్న తరుణంలో అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. మరో వైపు అమెరికా కొత్త రక్షణ వ్యూహన్ని సిద్దం చేయాలని భావిస్తోంది.

సైనిక బలాన్ని పెంచుకోవాలి

సైనిక బలాన్ని పెంచుకోవాలి

చైనా, రష్యా లాంటి దేశాలతో పాటు ఇతర దేశాలు సైనిక సామర్థ్యాన్ని పెంచుకొంటున్నాయి. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున అమెరికా కూడ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. కొంత కాలంగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకొనే విషయంలో బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని అమెరికా అభిప్రాయపడుతోంది.

తగ్గుతోన్న అమెరికా బలం

తగ్గుతోన్న అమెరికా బలం

అన్ని రంగాల్లో అమెరికా బలం ఇంత కాలం పాటు అగ్రస్థానంలో ఉంది. అయితే ఇతర దేశాలు కూడ అన్ని రంగాల్లో తమ సైనిక బలాన్ని పెంచుకొంటున్నాయి. వాయి, అంతరిక్షంలో, సైబర్ స్పేస్ లో ను అమెరికాదే అధిపత్యం. అయితే ఇతర దేశాలు ఈ విషయంలో అమెరికాతో పోటీ పడుతున్నాయి. కొంత కాలంగా అమెరికా సైనిక అవసరాల కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్న కారణంగా సైనిక బలం తగ్గుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి దేశాలు తమ బలాన్ని పెంచుకొనే వ్యూహలను రూపొందిస్తున్నారు. దీంతో అమెరికా కొంత ఇబ్బందికి గురౌతోందని రక్షణ నిపులు అభిప్రాయంతో ఉన్నారు.

సైనిక శక్తిని బలోపేతం చేయాలి

సైనిక శక్తిని బలోపేతం చేయాలి


ఇతర దేశాలు సైనిక శక్తిని బలోపేతం చేసుకొంటున్న తరుణంలో వారి కంటే ఎక్కువగా సైనిక శక్తిని పునరుత్తేజం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రత్యర్థుల కంటే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కొత్త రక్షణ వ్యవస్థను రూపొందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+