గ్యాస్ కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 9 మంది గల్లంతు.. 152 మందికి సీరియస్

రష్యాలోని అమూర్ ప్రాంతంలో ఓ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాలను ఆ ప్లాంట్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ లో వెల్లడించింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ లో పనిచేసే 152 మందికి గాయాలైనట్లు పేర్కొంది. వారిలో 36 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాద ఘటనను అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రచురించింది. గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ నుంచి దట్టమైన నల్లని పొగలు భారీ స్థాయిలో అక్కడి వాతావరణాన్ని కమ్మేశాయి. దాంతో ఆ ప్రాంతం భయానక వాతావరణంలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

క్షతగాత్రులను అత్యవసరంగా తరలించేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గాయపడిన కార్మికులను రష్యాలోని వివిధ ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక ఈ కాంప్లెక్స్ ను రష్యన్ పెట్రో కెమికల్ కంపెనీ సిబుర్ అలాగే చైనీస్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ సినోపెక్ లు సంయుక్తంగా ఆపరేట్ చేస్తున్నాయి. అయితే ఈ కంపెనీ ఇంకా పనులు ప్రారంభించలేదు. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ ఘటనపై రష్యాకు చెందిన దర్యాప్తు కమిటీ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో పారిశ్రామిక రంగంలోని కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి.

Russia gas plant Massive explosion at a gas chemical plant 7 dead 9 missing 152 critically injured

ఇక ఈ అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణంలో గరిష్టంగా దాదాపు 30 వేల మందికి పైగా కార్మికులు పనిచేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే దాదాపు 10 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ వరల్డ్ లోనే అతిపెద్ద పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ఇది పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ఏడాదికి 23 లక్షల టన్నులకు పైగా పాలిథిలిన్ అలాగే 4 లక్షల టన్నుల పాలీప్రొపైలిన్ ఉత్పత్తి కానుంది. ఈ మేరకు సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+