Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాంతి చర్చలకు రష్యా ఆఫర్ ! .. బెలారస్ వేదిక మార్చితేనే వ‌స్తాం : ఉక్రెయిన్ అధ్యక్షుడు షరతు

ఉక్రెయిన్‌పై నాలుగో రోజు కూడా మిస్సైళ్లతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. గ్యాస్, చమురు నిక్షేపాలే లక్ష్యంగా రష్యా బలగాలు బాంబులతో దాడులు చేస్తున్నాయి. ఖర్కీన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న సైనికులు.. అక్కడ చమురు పైప్‌లైన్‌ను పేల్చేశాయి. ఒకవైపు ఈ దాడులు కొనసాగుతుండగానే రష్యా శాంతి చర్చలకు ఉక్రెయిన్‌ను ఆహ్వానించింది.

ర‌ష్యా ఆఫ‌ర్ తిర‌స్క‌ర‌ణ‌

ర‌ష్యా ఆఫ‌ర్ తిర‌స్క‌ర‌ణ‌


చ‌ర్చ‌ల్లో భాగంగా రష్యా ప్రతినిధులు బెలారస్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం కోసం ఎదురు చూస్తోంది. అయితే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యా ఆఫర్‌ను తిరస్కరించారు. రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని బెలారస్ నుంచే జరుపుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకం నివసించే ప్రాంతాలపై రష్యన్ బలగాలు బాంబులతో విరుచుకుపడతున్నాయని మండిప‌డ్డారు. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెలార‌స్ వేదిక మార్చండి.. అప్పుడు వ‌స్తాం

బెలార‌స్ వేదిక మార్చండి.. అప్పుడు వ‌స్తాం


రష్యాతో తాము చర్చలకు సిద్ధమే కాని వాటిని బెలారస్ ప్రాంతం ఆమోదయోగ్యమైంది కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధ వాతావరణం లేని ప్రాంతాల్లో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు . ఇస్తాంబుల్, బాకు, వార్సా ప్రాంతాల్లో ఏ చోటైన చర్చలు జరపాలన్నారు. అక్కడికి తాము వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. మరోపైపు రష్యా దాడులపై ఐసీజేకి ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. మారణ హోమానికి రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. రష్య సైనిక చర్యలను నిలిపివేసేలా ఆదేశించాలని అంర్జాతీయ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

పుతిన్ కు మరో షాక్

పుతిన్ కు మరో షాక్


మ‌రోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పలుదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా వాటిని లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై బాంబులతో దాడులను కొనసాగిస్తున్నారు. తాజాకు పుతిన్ కు మ‌రో షాక్ తగిలింది. జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష ఇంటర్నేషనల్‌లో జూడో అంబాసిడర్ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఐజేఎఫ్ ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది. ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+