Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్థం .. పుతిన్‌కు వ్యతిరేకంగా మాస్కోలో ఉద్యమం

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు దూకుడుకు ప్రపంచ దేశాలు కళ్లేంవేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికాతో పాటు ఐరోపా దేశాలు కూడా కఠిన ఆంక్షలు విధించాయి. అయినా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌పై మరింత రెచ్చిపోతున్నారు. అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ చూట్టూ యుద్ధ ట్యాంకర్లు మోహరించారు. ప్రధాన నగరాలపై పిరంగులతో దాడులు చేస్తున్నారు.

 పుతిన్ రష్యా పౌరుడే కాదు

పుతిన్ రష్యా పౌరుడే కాదు


రష్యా చర్యలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ర‌ష్యన్‌లు కూడా త‌ప్పుబ‌డుతున్నారు. పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా రష్యా ప్రతిపక్షనేత ఎలెక్సీ నెవెలనీ పుతిన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు పుతిన్ రష్యా పౌరుడే కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

 ఉక్రెయిన్ ప్రజలపై ఇంత ద్వేష‌మా..

ఉక్రెయిన్ ప్రజలపై ఇంత ద్వేష‌మా..

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను ఎలెక్సీ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం పరిస్థితులు చాలా దిగ్భాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను చూస్తూ తాను మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. గత చరిత్రను పట్టుకుని ఉక్రెయిన్ ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శాంతి , సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని ఎలెక్సీ పిలపునిచ్చారు. తాను కూడా సోవియట్ యూనియన్ నుంచి వచ్చినవాడినేనని పేర్కొన్నారు.

 పుతిన్ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం

పుతిన్ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం


రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను ప్రపంచ దేశాలు చీదరించుకుంటున్నాయని ఎలెక్సీ అన్నారు. పుతిన్ తీరును ఖండిస్తూ రష్యా ప్రధాన కూడళ్లో నిరసనలు తెలపాలన్నారు. అంతే కాకుండా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా యుద్ధాన్ని వ్యతిరేకించాలని రష్యా ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న రష్యన్ ప్రజలు అక్కడి రష్యా రాయబార కార్యాలయ ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ భయాన్ని వీడాలన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని చేయాలని ఎలెక్సీ పేర్కొన్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+