సిగరెట్ నిషేధం కోసం రష్యా సంచలన నిర్ణయం..

రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం 2033నుంచి అమలులోకి రానుంది.

మాస్కో: తమ దేశ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రష్యన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశాన్ని పూర్తి పొగాకు నిషేధ రహితంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

తాజాగా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. 2015 తర్వాత జన్మించేవారికి సిగరెట్ల విక్రయాలు చేపట్టకూడదంటూ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య శాఖ నిర్ణయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. దీంతో పొగాకును పూర్తిగా రద్దు చేస్తున్న దేశంగా రష్యా చరిత్రలోకి ఎక్కనుంది.

Russia Proposes Cigarette Ban For Anyone Born After 2015

రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం 2033నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం 2015లో జన్మించిన రష్యన్ పౌరులకు అప్పటికీ 18 ఏళ్లు వస్తాయి. కాబట్టి ఆ తరం మొత్తాన్ని సిగరెట్ ఉత్పత్తులకు దూరంగా ఉంచాలని రష్యా భావిస్తోంది.

సిద్దాంతపరంగా ఈ నిర్ణయం చాలా కచ్చితత్వంతో కూడుకున్నదని రష్యన్ పార్లమెంట్ ఆరోగ్య కమిటీ సభ్యుడు నికోలాయ్ గెరాసిమెన్కో పేర్కొన్నారు. రద్దుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను వివిధ ఫెడరల్ ఏజెన్సీలతో పాటు ఆర్థిక సంస్థలకు పంపించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+