• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్ కు రష్యా ఝలక్..! భారత్ రాజ్యాంగ బద్దంగానే మార్పులు చేసిందని వెల్లడి..!!

|

మాస్కో/హైదరాబాద్ : కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలను సభ్య దేశాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఆర్టికల్ 370 అంశంలో యూఎన్వో నుండి ప్రతికూల ఫలితం రావడంతో దిక్కుతోచని పాకిస్తాన్ కు రష్యా గట్టి షాక్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్‌ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రష్యా సమర్థించింది. అది అంతర్గత వ్యవహారమని, భారత రాజ్యంగబద్ధంగానే కశ్మీర్‌లో మార్పులు జరిగాయని పేర్కొంది. ఈ సందర్భంగా రష్యా కూడా శిమ్లా ఒప్పందం గురించే ప్రస్తావించింది.

కశ్మీర్‌ పై పాక్‌కు రష్యా షాక్‌..! రాజ్యాంగబద్ధంగానే మార్పులు జరిగాయని వెల్లడి..!!

కశ్మీర్‌ పై పాక్‌కు రష్యా షాక్‌..! రాజ్యాంగబద్ధంగానే మార్పులు జరిగాయని వెల్లడి..!!

'జమ్ముకశ్మీర్‌ హోదా మార్పు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది భారత రాజ్యాంగ విధివిధానాలకు లోబడే జరిగింది. ఈ నిర్ణయాల వల్ల భారత్‌, పాక్‌ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. 1972 నాటి శిమ్లా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఆ దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి' అని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది.

రేపు వయనాడ్‌లో రాహుల్ పర్యటన..! వరద బాదితులకు అండగా మాజీ కాంగ్రెస్ ఛీఫ్..!!

యూఎన్వోలో భారత్ కు బాసట..! చేయి కలిపిన రష్యా..!!

యూఎన్వోలో భారత్ కు బాసట..! చేయి కలిపిన రష్యా..!!

కశ్మీర్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి భారత్‌ను తప్పుబట్టాలని ఎదురుచూస్తున్న పాక్‌కు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఇప్పటికే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం కోసం చేసిన పాక్‌ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఇప్పుడు తాజాగా రష్యా కూడా భారత చర్యనే సమర్థించింది. ఒకవేళ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌ ప్రస్తావించినా భారత్‌కు రష్యా మద్దతు లభిస్తుందనేది తాజాగా స్పష్టమవుతోంది.

తీరం వెంబడి గస్తీ పెంచిన నావికాదళం..! ఉగ్రదాడికి అవకాశాలన్న నిఘా వర్గాలు..!!

తీరం వెంబడి గస్తీ పెంచిన నావికాదళం..! ఉగ్రదాడికి అవకాశాలన్న నిఘా వర్గాలు..!!

భారత నావికా దళం తీర ప్రాంత గస్తీని మరింత పెంచింది. ఉగ్రవాదులు తీరం వెంబడి భారత భూభాగంలోకి చొరబడి దాడి చేసే అవకాశాలున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉందని నావికాదళ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లోనే కాక సముద్ర జలాల్లో పహారా బాగా పెంచామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. రాడార్ల సాంకేతికత ద్వారా, సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కీలక ప్రాంతాల్లో నౌకాదళాన్ని మోహరింపజేశామని ఆ అధికారి వెల్లడించారు.

శత్రువుల కదలికలపై అప్రమత్తం..! అత్యాదుని సాంకేతిక వాడుతున్న నావికాదళం..!!

శత్రువుల కదలికలపై అప్రమత్తం..! అత్యాదుని సాంకేతిక వాడుతున్న నావికాదళం..!!

మరోవైపు శత్రువా? మిత్రుడా? అనేది భారత నేవీ సులువుగా తెలుసుకొనేలా దేశంలో 2.5 లక్షల వరకూ ఉన్న 20 మీటర్ల కన్నా ఎత్తున్న మత్స్యకారుల పడవలన్నింటికీ ఓ ట్రాకింగ్‌ వ్యవస్థను బిగించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్‌ బజ్వా చేసిన వ్యాఖ్యలను అధికారులు ప్రస్తావించారు. కశ్మీర్‌ ప్రజల బాగు కోసం తాము ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. జైష్‌-ఎ-మహమ్మద్‌ నాయకుడు మసూద్‌ అజర్‌కు సోదరుడైన ఉగ్రవాది రహుఫ్ అజర్‌ ఈ మధ్య పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తిరుగుతున్నాడని నిఘా వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan has once again suffered a setback from the international community in the Jammu and Kashmir affair. Russia upheld the Indian government's decision on Kashmir. It is an internal affair and the Indian state has made changes in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more