మైమరిపించే కేరళ అందాలు.. చూడాలంటే రెండు కళ్లు సరిపోవు.. బడ్జెట్ ధరలోనే బెస్ట్ ట్రిప్..
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. మనదేశంలోని రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. హిమాలయ పర్వతాల నుంచి కన్యా కుమారి వరకు ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా భారత్ ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళ గురించి చెప్పాలంటే మాటలు రావు. చూడాలంటే రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా ఈ ప్రాంతం ఉంటుంది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. ఈ వేసవిలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కేరళ టూర్ వేయాలని ఉందా..? అయితే మీకోసం రైల్వే శాఖ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బడ్జెట్ ధరలోనే ఎంచక్కా కేరళ అందాలను తనివితీరా వీక్షించే అవకాశం కలుగుతోంది.
కేరళ అందాలను చూడాలని ఉందా..? తక్కువ ధరకే గాడ్స్ ఓన్ కంట్రీని చుట్టేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. కేరళ టూర్ ను ఇప్పుడు తక్కువ ధరకే రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో కుటుంబంతో కలిసి కేరళ టూర్ ప్లాన్ చేయండి. ఈ మేరకు ఐఆర్సీటీసీ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ఈ టూర్ లో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. రిటర్న్ జర్నీలో మీరు ఈ ప్రాంతాల్లో దిగే అవకాశం కూడా ఉంది.

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. రాత్రంతా జర్నీ సాగుతుంది. తెళ్లారి అలువా స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. రాత్రికి మున్నార్ లో బస చేశాక.. మరుసటిరోజు ఎవరికులం నేషనల్ పార్క్ లో పర్యటిస్తారు. అనంతరం టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ పర్యటన ఉంటుంది. మరుసటిరోజు అలెప్పిలోని బ్యాక్ వాటర్ అందాలను వీక్షిస్తారు. ఆ తర్వాత మరుసటిరోజు ఎర్నాకుళం స్టేషన్ కు చేరుకుని ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. తిరిగి మరుసటిరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో జర్నీ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications