తెలంగాణ లో పది ఫలితాల తేదీలు ఖరారు చేసిన బోర్డు - ఈ సారి ప్రత్యేకంగా..!!
పది పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్ అలర్ట్. పరీక్షా ఫలితాల వెల్లడి పైన పదో తరగతి బోర్డు కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడి దిశగా బోర్డు కార్యాచరణ అమలు చేస్తోంది. ఫలితాల ప్రక్రియ పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తోంది. ఇక.. ఫలితాల వెల్లడి ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఈ సారి మార్కులు వెంటనే తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణలో పది ఫలితాల వెల్లడికి ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 16తో ముగిసాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. పేపర్ల స్కానింగ్ కూడా ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) కొనసాగుతోంది. ఎటువంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 29 లేదా 30 తేదీల్లో అధికారికంగా ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో పది పరీక్షలకు 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 25వ తేదీతో మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. మార్కుల క్రోడీకరణకు పది రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అనుకున్న దానికంటే ముందుగానే ప్రకటించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది.

వాట్పప్ ద్వారా అందుబాటులోకి మార్కులు
ఇక, ఫలితాల వెల్లడి పైన ఈ ఏడాది తెలంగాణ SSC బోర్డు విద్యార్ధుల కోసం కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించటంతో.. ఫలితాలను సైతం అదే విధంగా అందుబాటులోకి తీసుకు రావాలని డిసైడ్ అయింది. వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 5న తెలంగాణ పదో తరగతి ఫలితాల వెల్లడికి అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications