భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా సెక్రటరీ జనరల్ మార్కో రూబియో భారత్ కు గ్రీటింగ్స్ తెలిపారు. భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత ధృడంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య నిరంతరంగా అభివృద్ధికి ప్రధాన కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సత్సంబంధాలేనని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా తన శుభాకాంక్షలను మార్కో రూబియో తెలియజేశారు.
US Secretary of State Marco Rubio says, "On behalf of the United States of America, I extend warm congratulations to the people of India on their Independence Day.
— ANI (@ANI) August 15, 2026
Thanks to the personal relationship between President Trump and Prime Minister Modi, the U.S.-India relationship… pic.twitter.com/agu2OGJstL
" యూనెైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరఫున భారత ప్రజలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సత్సంబంధాలకు కృతజ్ఞతలు. భారత్- అమెరికా మధ్య దృఢమైన బంధాలు మరింత బలంగా ముందుకు సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య డిఫెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ నుంచి క్రిటికల్ మినరల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ కో ఆపరేషన్ అండ్ కామర్స్ రంగాల్లో విస్తృతమైన భాగస్వామ్యం అవగాహన కలిగి ఉన్నాయి. మన రెండు దేశాలతోపాటు ఇండియన్ ఓషియన్ ప్రాంతం కూడా పటిష్టంగా ఉండేందుకు ముందుకు సాగుతున్నాం.." అని మార్కో రూబియో స్పష్టం చేశారు.

మరోవైపు రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ సైతం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగింపుపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ దినదినాభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. మీ కలలు అన్నీ నెరవేరుతాయని ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అలిపోవ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. జై హింద్.. లాంగ్ లీవ్ రష్యా- భారత్ ఫ్రెండ్ షిప్ అని స్పష్టం చేశారు. అటు భారత్- రష్యా మధ్య దశాబ్దాల కాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications