ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20లోగా మీ ఖాతాల్లో రూ.25 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం నేతన్న సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం అర్హులైన చేనేత కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ పథకానికి సంబంధించిన నిధులను ఇప్పటికే చేనేతల ఖాతాలో జమ చేశారు.
అర్హత ఉన్నా పథకం అందకపోతే ఆందోళన వద్దు: మంత్రి సవిత
అయితే కొంతమంది పథకం కోసం అప్లై చేసుకున్న చేనేతలకు అర్హతలు ఉన్నప్పటికీ ఈ పథకం వర్తించకపోవటంతో చేనేతలు ఆందోళనలో ఉన్నారు. అటువంటి వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. అర్హత ఉండి కూడా సహాయం అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హత ఉన్న చేనేత కార్మికులకు సహాయం అందిస్తుందని ఆమె తెలిపారు.

ఈనెల 20వ తేదీలోగా వారి ఖాతాలో డబ్బులు
దరఖాస్తు చేసుకున్న వారు, ఏవైనా అనుమానాలు ఉంటే చేనేత జౌళి శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. తప్పుడు వార్తలు, వదంతులు నమ్మి భయపడవలసిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో డబ్బులు పడని వారికి ఈనెల 20వ తేదీలోగా వారి సమస్యను పరిష్కరించే బ్యాంక్ కథలు డబ్బులు జమ చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. కొత్త దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నామని త్వరలోనే నిధులు పంపిణీ చేస్తామని తెలిపారు.
కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నాం అన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 71,536 మంది చేనేతలకు 25వేల రూపాయలు చొప్పున సహాయం అందించినట్టు మంత్రి సవిత పేర్కొన్నారు. కొత్తగా 13678మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరి దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం అరకులో గుర్తింపు ప్రక్రియ వేగంగానే కొనసాగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా నేతన్న సేవలో పథకం పొందాలని భావించే చేనేత కార్మికులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలని, చేనేత సంఘాలలో, లేదా చేనేత సొసైటీలో సభ్యుడిగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ అర్హతలు ఉంటేనే నేతన్న సేవలో
సొంత మగ్గం కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడుతూ ఉండాలని తెలిపారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఆధార్, చేనేత మగ్గం గుర్తింపు కార్డు, సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ఉండాలని, ఇవన్నీ సరిగ్గా ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications