ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ సీఈఓపై హత్యాయత్నం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యా భూభాగంలో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. రష్యన్ సైన్యానికి అత్యంత కీలకమైన డ్రోన్లను సరఫరా చేసే ఓ ప్రముఖ రక్షణ సంస్థ సీఈవోపై హత్యాయత్నం జరిగింది. రష్యా సైన్యం ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఉపిర్ ఎఫ్‌పీవీ డ్రోన్లను తయారుచేసే 'ఉరల్‌డ్రోన్‌జావోడ్' కంపెనీ సీఈవో వ్లాదిమిర్ త్కాచుక్ లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. యెకాటెరిన్‌బర్గ్ సమీపంలోని బోల్షోయే ఇస్తోక్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు వెళ్తుండగా ఈ విస్పోటనం జరిగింది. కారు కింద ముందే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

దుబాయ్‌ అతలాకుతలం .. 20 నిమిషాల్లో 7 భీకర దాడులు
దుబాయ్‌ అతలాకుతలం .. 20 నిమిషాల్లో 7 భీకర దాడులు

డ్రైవర్ మృతి.. సీఈవో పరిస్థితి విషమం
ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి మెర్సిడెస్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వ్లాదిమిర్ త్కాచుక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఈ దాడికి ఎవరు ఒడిగట్టారనే దానిపై రష్యన్ భద్రతా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు కింద పేలుడు పదార్థాలను అమర్చారని, మెర్సిడెస్ అతివేగంగా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించిందని తెలుస్తోంది. దాడి వెనుక ఉన్నవారి గుర్తింపు ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. రష్యా ఏజెన్సీలు దర్యాప్తును ప్రారంభించాయి. ఉక్రెయిన్ నుంచి తక్షణమే ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

Russia Ukraine War Assassination Attempt on Russian Drone CEO Vladimir Tkachuk Injured in Car Bombing

రష్యా క్షిపణి దాడుల్లో 17 మంది మృతి
ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున కీవ్, పరిసర ప్రాంతాలపై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులలో 17 మంది మరణించగా.. 44 మంది గాయపడ్డారు. పలు వ్యాపార సంస్థలు, ఓ రైల్వే స్టేషన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా లక్ష్యాలలో యుద్ధంతో సంబంధం లేని ఒక బ్రూవరీ, నిర్మాణ సామగ్రి గిడ్డంగి, మెయిల్ సార్టింగ్ ఆఫీస్ ఉన్నాయని, ఈ ప్రదేశాలకు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.

తెల్ల కాగితంపై రాసిన వీలునామా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?
తెల్ల కాగితంపై రాసిన వీలునామా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?

అయితే ఆ వ్యాపార సంస్థలకు సైనిక సంబంధాలు ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ దాడులు, దాదాపు ప్రతిరోజూ జరుగుతున్న రష్యా భారీ స్థాయి బాలిస్టిక్ క్షిపణి దాడుల పరంపరలో భాగం.అమెరికా పేట్రియాట్ వ్యవస్థకు చెందిన ఇంటర్‌సెప్టర్ క్షిపణుల తీవ్ర కొరతను అవకాశంగా తీసుకుని ఈ వేగవంతమైన దాడులు జరుగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల సామర్థ్యం ఉన్న ఉక్రెయిన్ ఏకైక వాయు రక్షణ ఆయుధం పేట్రియాట్ వ్యవస్థ. ఇరాన్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడటంతో, జెలెన్స్కీ మరిన్ని మందుగుండు సామగ్రి కోసం ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+