పీకల్లోతు కష్టాల్లో పుతిన్: ఇది జస్ట్ బిగినింగే- ఉక్రెయిన్ ఘాటు రిప్లై

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చిక్కుల్లో పడ్డారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఆయనకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఇది జస్ట్ బిగినింగ్ అంటూ ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది.

ఆమ్‌స్టర్‌డామ్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. చిక్కుల్లో పడ్డారు. యుద్ధ నేరస్తుడిగా ఆయనపై ముద్ర పడింది. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారాయన. ఈ కారణంతో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక అరెస్ట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇది కాస్త రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినట్టయింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి 24వ తేదీన ఈ యుద్ధం ఆరంభమైంది. ఏడాది దాటిపోయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

Vladimir Putin

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన కారణంతో రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ వెలివేశాయి. అనేక రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించాయి. అటు రష్యాపై ఎదురు తిరగడానికి అవసరమైన సహాయ సహకారాలను ఉక్రెయిన్ కు అందజేస్తోన్నాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని ఉక్రెయిన్ కు సరఫరా చేస్తోన్నాయా దేశాలన్నీ. అమెరికా సహా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్ వైపే నిలిచాయి. అయినప్పటికీ- పుతిన్ ఎక్కడా తలవంచట్లేదు. ఒత్తిళ్లకూ గురికావట్లేదు.

Vladimir Putin

ఈ పరిణామాల మధ్య- అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్లాదిమిర్ పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నెదర్లాండ్స్ ది హేగ్ లో గల ఈ కోర్ట్ న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా వెంటనే పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రజలను చట్టవిరుద్ధంగా తన దేశానికి తరలించారనే కారణంతో పుతిన్ అరెస్ట్ కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వారెంట్ జారీ చేసింది.

Zelenskyy

ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేవ్నా ల్వోవా-బెలోవాకు కూడా కోర్టు వారెంట్లను పంపించింది. ఈ పరిణామాలు రష్యాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. ఇది బిగినింగ్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. మున్ముందు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా ఎన్నో రకాల న్యాయపరమైన కేసులను ఎదుర్కొనడం ఖాయమని, దానికి తొలి అడుగు పడిందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+