వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌పై యుద్ధం .. రష్యాకు భారీగా ఎదురు దెబ్బ.. మేజర్ జనరల్ ఆండ్రీ హతం ?

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. గత ఎనిమిది రోజులుగా గ్యాప్ లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. పెను విధ్యంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆస్పత్రులు, వివాసప్రాంతాలను, స్కూళ్లను టార్గెట్ చేస్తూ భీకర దాడులకు దిగాయి. రష్యా బాంబుల దాడులకు ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు కూడా భారీ సంఖ్యలో మృతి చెందారు. అటు ఉక్రెయిన్ దళాల ప్రతిఘటనలో రష్యా సైనికులు వేలల్లో ప్రాణాలు కోల్పోయారు.

ర‌ష్యా సుఖోయ్ కూల్చివేత‌..

ర‌ష్యా సుఖోయ్ కూల్చివేత‌..


రష్యా బలం, బలగంతో పోల్చితే ఉక్రెయిన్ శక్తిసామర్థ్యాలు తక్కువే.. అయినా మాస్కో దళాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ప్రధాన పట్టణాలనే టార్గెట్ చేస్తూ రష్యా విధ్వంసానికి దిగింది. ఖార్కీన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ర‌ష్యాకు చెందిన‌ అంత్యంత శక్తి వంతమైన యుద్ద విమానం సుఖోయ్‌ను ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ దళాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ . అలాంటి ఎయిప్ కాప్ట్‌ను ఉక్రెయిన్ ఒక్క దెబ్బతో కూల్చేసింది.

రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్ స్కీ హ‌తం

రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్ స్కీ హ‌తం

ఈ పరిణామాల నేపథ్యంలో నెక్ట్సా మీడియా సంచలన విషయాలు వెల్లడించింది. రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్ స్కీ మరణించినట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ ను ఉక్రెయిన్ దళాలు హతమార్చినట్లు తెలిపింది. ఈ యుద్ధంలో రష్యాకు భారీగా నష్టం వాటిల్లింది. సుమారు 9వేల మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 30 విమానులు కూల్చివేసింది. అటు 31 హెలికాప్టర్లు, 217 ట్యాంకులు, 900 సాయుధ శకటాలు, 374 యుద్ధ వాహనాలతో సహా యుద్ధ సామాగ్రిని ద్వంసం చేసినట్లు ప్రకటించింది. రష్యా దాడులకు భయపడేది లేదని.. సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపింది.

Recommended Video

Russia Ukraine Conflict : Russia కు చెందిన ప్రైవేట్ Aircrafts ను సీజ్ చేసిన America | OneindiaTelugu
ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం

ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం

ఉక్రెయిన్‌తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గిలావ్రోవ్ మరోసారి స్పష్టం చేశారు. త‌మ‌ ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందన్న భావనను ఆయ‌న‌ వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, యూరప్ ప్రాంతానికి భద్రతా హామీలపై చర్చంచేందుకు రష్యా సిద్ధంగాఉందని పేర్కొన్నారు.. కానీ దేశ భద్రతకు సవాల్ విసిరేందుకు మాత్రం ఉక్రెయిన్ ను రష్యా అనుమతించబోదని సెర్గిలావ్రోవ్ స్పష్టం చేశారు.

English summary
Big Shock to Russia .. Russian Major general Andrei sukhovtsky killed in Ukrine ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X