ఉక్రెయిన్ పై రష్యా బిగ్గెస్ట్ ఎటాక్.. 537 క్షిపణులతో విధ్వంసం..

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ తో ఊహకందని విధ్వంసానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం క్లైమాక్స్ కు వచ్చినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే 249 డ్రోన్ లను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.

మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా జూన్ 29 ఆదివారం రోజున ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. 477 డ్రోన్ లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వైమానిక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ పై ఇదే అతిపెద్ద దాడిగా ఆ దేశం పేర్కొంది. 249 డ్రోన్ లను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది.

ఉక్రెయిన్ లోని పలు కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్స్ హెడ్ యూరీ ఇహ్ నాత్ తెలిపారు. రష్యా దాడిలో వెస్ట్ ఉక్రెయిన్ లోని వీవ్, పోల్తావా, మైకోలైవ్, నిప్రోపెట్రోవిస్క్,చెర్కసీ ప్రాంతాలు ధ్వంసం అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల స్థానిక గవర్నర్లు తమకు నివేదించారని పేర్కొన్నారు.

Russia Unleashes Largest Airstrike on Ukraine 477 Drones 60 Missiles Target Nation

రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ నడిపే పైలట్ మృతి చెందినట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. రష్యా డ్రోన్ లు, మిసైల్స్ ను అడ్డుకునే క్రమంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇదే విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విరుచుకుపడ్డారు. పుతిన్ యుద్ధాన్ని కొనసాగించాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు.

అంతర్జాతీయ సంస్థలు శాంతిని సూచిస్తుంటే పుతిన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నారని.. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసిపోవడం ఆయనకు ఇష్టం లేదంటూ జెలెన్ స్కీ ఫైర్ అయ్యారు. మేము ప్రతిదాడులకు దిగుతామని.. తమ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గమని జెలెన్ స్కీ తెలిపారు. ఈ మేరకు అమెరికా నుంచి అత్యాధునిక యాంటీ- మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు జెలెన్ స్కీ సుముఖత వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+