రష్యాపై 5,500 ఆంక్షలు: మేం తల్చుకుంటే మీకు మూడినట్లే.! అమెరికా, యూరప్ దేశాలకు పుతిన్ వార్నింగ్ !!
ఉక్రెయిన్‌పై బాంబుల దాడులతో విరుచుకుపడుతున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికాతో పాటు, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించారు. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాడులను ముమ్మరం చేశారు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆంక్షలను కఠినతరం చేశాయి. చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మాస్కోపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ దేశాలు తమతో కలిసి వస్తాయని ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అటు రష్యా ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇతర దేశాలతో వ్యాపారం చేసే సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరించారు.
Recommended Video

రష్యాపై అమెరికా, ఈయూ ఆంక్షలు
అటు యూరోపియన్ యూనియన్ కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేసింది. రష్యాకు సహకరిస్తున్న బెలారస్‌పై కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈయూ దేశాలు నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగడంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిలచింది. మాస్కోతో వాణిజ్య సంబంధాలకు చెక్ పెట్టాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వారి హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఉక్రెయిన్ పై దాడులను ఆపడంలేదు..

యూరప్ దేశాలకు రష్యా వార్నింగ్..
అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తమపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే అని హెచ్చరించారు. జర్మనీని గ్యాస్‌ను తక్షణమే నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా మీపై ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టితే తట్టుకోలేరని హెచ్చరిక ఇచ్చారు. తమపై విధించిన ఆంక్షలకు స్ట్రాంగ్‌గా స్పందించాల్సి ఉంటుందన్నారు. పాశ్చాత్య దేశాలకు నొప్పి అంటే ఎంటో తెలిసే విధంగా తాము ఆంక్షలు విధాస్తామని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్ దిమిత్రి బిరిచెవ్ స్కీ హెచ్చించారు.

ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న సైనిక చర్యలకు దిగింది. ఆ తర్వాత రష్యాపై అమెరికా, బ్రిటిన్‌తో పాటు పాశ్చాత్య దేశాలు 2700కు పైగా ఆంక్షలు విధించాయి. ముద్దాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాయి. ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొన్న దేశంగా రష్యా నిలిచింది. ప్రస్తుతం రష్యాపై మొత్తం 5,500కు పైగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఉత్తర కొరియా, ఇరాన్ ల కంటే ఎక్కువ ఆంక్షలను ఎదుర్కొంటోంది.. ఈనేపథ్యంలో రష్యా పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తాము తలచుకుంటే అత్యంత వేగంగా కచ్చితంగా ఉంటుందని పేర్కొంది. వాటిని ఎదుర్కొనేవారికి నొప్పి తెలుస్తుందని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications