రష్యా వైమానిక దాడుల్లో 300మంది ఉగ్రవాదుల హతం

మాస్కో/సిరియా: రష్యా వైమానిక దళాలు ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో జరిపిన వైమానిక దాడుల్లో 300మంది ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులు మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను గుర్తించి వాటిపై బాంబుల వర్షం కురిపించినట్లు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదుల 17 శిక్షణా కేంద్రాలను, వాహనాలను, ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు వైమానిక దళ అధికారులు పేర్కొన్నారు.

ఇందుకోసం కెఏబి-500 బాంబులను కురిపించే ఎస్ యు- 34, ఎస్ యు- 24 జెట్ ఫైటర్లను వినియోగించినట్లు తెలిసింది. సిరియా అధ్యక్షుడు అల్ అసద్‌కు అనుకూలంగా తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులపై పదిరోజుల కిందట దాడులు ప్రారంభించిన రష్యా.. రోజుకు పది ప్రత్యేక లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.

Russian airstrikes kill 2 ISIS commanders, 300 militants in Syria

గ్వాటెమాలాలో 253కి పెరిగిన మృతులు

సెంట్రల్‌ అమెరికాలోని గ్వాటెమాలాలో ఇటీవల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 253కి చేరింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో చాలా గ్రామాలు నేలమట్టమయ్యాయి.

వందలాది మంది ప్రజలు కొండచరియల కింద శిథిలాల్లో చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సహాయ సిబ్బంది మరో 16 మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 253కి పెరిగిందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+