వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా కంప్యూటర్ ప్రోగ్రామర్ అరెస్ట్: అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ ఆరోపణలు

గత ఏడాది జరిగిన అమెరికా అథ్యక్ష ఎన్నికల్లో రష్యన్లు హ్యాకింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే ఈ ఆరోపణలకు ఊతమిస్తూ రష్యన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ను బార్సిలోనాలో అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బార్సిలోనా: గత ఏడాది జరిగిన అమెరికా అథ్యక్ష ఎన్నికల్లో రష్యన్లు హ్యాకింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే ఈ ఆరోపణలకు ఊతమిస్తూ రష్యన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ను బార్సిలోనాలో అరెస్టు చేశారు.

వయోటర్ లెవషోవ్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో అరెస్టు చేసినట్టు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా ఎన్నికలను ప్రభావింత చేసిన హ్యాకింగ్ దాడుల్లో ఇతడి హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

అమెరికా అంతర్జాతీయ అరెస్టు వారెంటుతో అతడిని అరెస్టు చేసినట్టు రష్యా రేడియో తన వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే లెవషోవ్ అరెస్టుకు కారణాలేమిటో వివరించేందుకు రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.

Russian computer programmer arrested in Spain reportedly over US election hacking

లేవషోవ్ శుక్రవారం నాడే అరెస్టు చేసినా, ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సాయం చేసేందుకు గాను డమొక్రటిక్ పార్టీ ఈ మెయిళ్ళను రష్యా హ్యకింగ్ చేసిందని అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

ఎన్నికల ప్రచారం సమయంలో రష్యాకు, ట్రంప్ కు మధ్య ఉన్న సంబంధాలు ఏంటనే విషయాన్ని అమెరికా కాంగ్రెస్ కూడ పరిశీలిస్తోంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉందన్న విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు.

English summary
A Russian programmer has been arrested in Barcelona, Spain, reportedly over suspicion that he was involved in a number of hacking attacks linked to Moscow’s alleged interference in the America presidential elections last year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X