వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్స్‌ను టచ్ చేశాడని.. డాక్టర్ పంచ్, మృతి(వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో ఓ వైద్యుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌ను కొట్టాడు. వైద్యుడి దెబ్బకు ఆ పేషెంట్ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సంఘటన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

తనకు వైద్య పరీక్షలు చేస్తున్న నర్స్‌ను పేషెంట్ అసభ్యకర రీతిలో తాకాడు. ఇది గమనించిన వైద్యుడు ఆ పేషెంట్ పైన పంచ్‌లు కురిపించాడు. దీంతో అక్కడే రోగి కన్నుమూశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ సంఘటన బొల్ గోరోడ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా నిక్షిప్తమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చాలామంది చూస్తున్నారు.

రోగిపై దాడి చేసిన వైద్యుడిని ఇల్యా జిలందినోవ్‌గా పోలీసులు గుర్తించారు. చనిపోయిన పేషెంటును 56 ఏళ్ల తెగెనీ బాక్తిన్‌గా గుర్తించారు. నర్సును ముట్టుకున్నాడని తెలియగానే... సదరు డాక్టర్ వెళ్లి.. 'నర్సును ఎందుకు ముట్టుకున్నావ్' అంటూ పంచ్ విసిరాడు.

English summary
Russian doctor punches patient to death in horrifying incident caught on surveillance camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X