సిరియాలో రష్యన్ ఎంబసీపై రాకెట్ల దాడి(వీడియో)
డెమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారులు రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి చేశారు. సి రియా రాజధాని డెమాస్కస్లో ఉన్న రష్యా రాయబార కార్యాలయంపై రెండు రాకెట్లతో తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమకు మద్దతు పలుకుతూ తమ దేశ వ్యవహారాల్లో రష్యా కలగజేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ వందల మంది సిరియా ప్రభుత్వ మద్దతుదారులు రష్యా రాయబార కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం గుమిగూడారు.
అదే సమయంలో తిరుగుబాటుదారులు రాకెట్ల దాడికి పాల్పడ్డారు. కార్యాలయం నుంచి పొగలు కమ్ముకొస్తుండటంతో మద్దతుదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సెప్టెంబరు 30వ తేదీ నుంచి రష్యా.. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియాలోని అల్నుస్రా ఫ్రంట్ ప్రతీకార చర్యలకు పిలుపునిచ్చింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications