మధ్యాకాశంలో రెండు యుద్ధ విమానాలు ఢీ.. పైలట్ల పరిస్థితి ఏంటో తెలుసా..?
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా అధికారులు పసిగట్టలేకున్నారు. తాజాగా రెండు యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే... రష్యాకు చెందిన ఎస్‌యూ-34 యుద్ధ విమానాలు గాల్లో శిక్షణ పొందుతుండగా ఢీకొన్నాయి. ఈ ఘటన జపాన్ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది.
రెండు యుద్ధ విమానాలు శిక్షణ పొందుతుండగా ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది విమానంలోనుంచి దూకేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ పైలట్ ఓ చెక్కను పట్టుకుని సముద్రంలో సహాయం కోసం ఎదురు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ వేస్తూ కనిపించడంతో ఆయన్ను కనుగొన్నామని అయితే అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకు వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు వివరించారు.

ఇదిలా ఉంటే బయటకు దూకిని మిగతా పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందన్నారు మిలటరీ అధికారులు .వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక ఢీకొన్న రెండు విమానాలు కూడా ఎక్కడ పడ్డాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వివరించారు. అయితే ఈ ఫైటర్ జెట్లు ఎలాంటి క్షిపణులు మోసుకెళ్లలేదని స్పష్టం చేశారు అధికారులు. ఇవి కేవలం శిక్షణ కోసమే వినియోగించినందున పెను ప్రమాదం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications