Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భీకర దాడులు.. మూడో అణు విద్యుత్ కేంద్రం స్వాధీనం దిశా రష్యా దళాలు
ఉక్రెయిన్‌పై 11వ రోజు కూడా రష్యా సేనలు దాడులు కొనసాగిస్తోంది. క్షిపణులతో విరుచుపడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచదేశాలు హెచ్చరిస్తున్నాయి. ఆంక్షలు విధించి.. కట్టడికి అనేక చర్యలు చేపట్టాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం లెక్కచేయడంలేదు. తమ లక్ష్యాన్ని సాధించేవరకు యుద్ధాన్ని ఆపేదిలేదని తేల్చి చెప్పారు.

రష్యా ఆధీనంలో ప్రధాన నగరం
ఉక్రెయిన్‌లోని ఓడరేవు పట్టణమైన ఖేర్సన్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొన్ని నగరాలను తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు వరుస బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రెండు అణు విద్యుత్ కేంద్రాలను తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. తాజాగా మరో అణువిద్యుత్ కేంద్రాన్ని కైవసం చేసుకునేందుకు దృష్టి పెట్టింది. మొదట చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్‌ను కైవసం చేసుకుంది. అనంతరం ఐరోపాలోనే అతిపెద్దదైన జపోరిజియా న్యూక్లియర్ పవర్ కేంద్రాన్ని హస్తగతం చేసుకుంది.

మూడో అణువిద్యుత్ కేంద్రం లక్ష్యంగా..
ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలే లక్ష్యంగా క్షిపణులతో రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. యుజ్నౌక్రైన్స్క్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రష్యా సేనలు మెకోలైవ్ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు.
అటు సముద్రతీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను కూడా రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులు కొనసాగుతున్నాయి. గత పదకొండు రోజులుగా కీవ్ పై పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. రష్యా సేనలు పట్టుసాధించలేకపోతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం రష్యా దళాలను సమర్థవంతంగా ప్రతిఘటిస్తున్నాయి.

రష్యాపై అమెరికా అధ్యక్షుడు సీరియస్
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా చర్యలు కేవలం ఉక్రెయిన్ పై జరుగుతున్న దాడి కాదని.. ఇది ఐరోపా మొత్తంపై జరుగుతున్న దాడేనని పేర్కొన్నారు. ఐరోపా ఖండం భద్రత, శాంతి, స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మండిపడ్డారు. నాటో సభ్యదేశాల రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని జో బైడెన్ స్ఫష్టం చేశారు. ఉక్రెయిన్ కు తాము అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications