మంటల్లో ఆసుపత్రి- డాక్టర్ల సాహసం -ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేశారు
భూమిపై కదిలే దేవుళ్లుగా జనం చేత మన్ననలు పొందే డాక్టర్లు.. ఇటీవల మరీ కమర్షియల్ గా తయారై, రోగుల్ని పీడించుకుతింటోన్న ఉదంతాలు చాలానే చూస్తున్నాం. 'ఠాగూర్'సినిమా తరహా ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అయితే, అన్ని సినిమాలు ఒకేలా ఉండవన్నట్లు రోగుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే డాకర్టు ఇప్పటికీ ఉన్నారని నిరూపించే ఘటన ఒకటి తాజాగా రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..
రష్యాలోని బ్లాగోవెష్‌చెన్స్క్‌లో గల టిసారిస్ట్-ఎరా ఆసుపత్రిలో.. ఓ రోగికి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆసుపత్రి మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ వైద్యులు మాత్రం ఏమాత్రం భయపడకుండా, గందరగోళానికి తావివ్వకుండా ఆపరేషన్‌ను పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన తాలూకు ఫొటోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.

విజయవంతంగా ఆపరేషన్..
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్-హార్ట్ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్‌ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికి మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏమాత్రం బెదరకుండా 2 గంటల పాటు సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని వేరేచోటుకు మార్చారు. ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా,

పొగ చొరబడకుండా ఫ్యాన్లు పెట్టి..
అగ్నిప్రమాదం సమయంలో ఓపెన్-హార్ట్ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది. ''మంటలు చెలరేగినా.. ఆ రోగిని కాపాడేందుకు మేం చేయగలిగిందంతా చేశాం'' అని వైద్యులు తెలిపారు. ఈ ఆసుపత్రిని 1907లో నిర్మించారు. పైకప్పు చెక్కతో చేసింది కావడంతో నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ తెలిపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆసుపత్రి నుంచి 128 మందిని ఖాళీ చేయించి సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications