వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది కిల్ఫీనే: గ్రనెడ్ పిన్ తీసి సెల్పీ, ప్రాణాలు పొగొట్టుకున్నాడు

|
Google Oneindia TeluguNews

మాస్కో: సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్‌తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. అలగ్జాండర్‌ సాష ఛెచిక్‌ అనే యువకుడు చేత్తో గ్రనేడ్‌ పట్టుకొని ఫొజులు పెడుతూ ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితులతో పంచుకుంటూ ఎంజాయ్‌ చేశాడు. అవి చూసిన స్నేహితులు భయపడిపోయారు. పిచ్చి పనులు చెయ్యొద్దని, ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. దాన్ని పారేయమని హెచ్చరించారు.

అయినా, అలెగ్జాండర్ మాత్రం వినిపించుకోకుండా గ్రనేడ్‌కు ఉన్న పిన్‌ తీసేసి ఫొటోలు దిగబోయాడు. పిన్‌ తీయగానే అది కాస్తా పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రనేడ్‌కు ఉన్న పిన్‌ తీస్తే అది పేలిపోతుందని గ్రహించలేక సాష దాన్ని అలాగే పట్టుకొన్నాడు. అందువల్ల అది చేతిలోనే పేలిపోయి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు.

Russian man dies after posing for photo with hand grenade

అతనిది ఆత్మహత్య కాదని, పొరపాటున జరిగిన ప్రమాదమని పోలీసులు తెలిపారు.
ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడం యువత మానుకోవాలని పోలీసులు హితవు పలికారు.

సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్‌తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.

English summary
A Russian man has died after he pulled the pin out of a hand grenade and posted photographs of himself holding it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X