డేటింగ్ కూడా చేయలేదు: పెట్టిన ఖర్చు కావాలని కోర్టుకెక్కిన ప్రియుడు
మాస్కో: తన మాజీ ప్రియురాలికి తాను పెట్టిన ఖర్చునంతటినీ తిరిగి ఇప్పించాలని ఓ మాజీ ప్రేమికుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన రష్యాలో జరిగింది. ప్రియురాలిని బయటకు తీసుకు వెళ్తే సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు.
ఇలాగే ఓ వ్యక్తి తన ప్రియురాలి కోసం బాగానే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు, మాత్రం ఆ సొమ్ము తనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టుకు ఎక్కాడు. రష్యాకు చెందిన 29 ఎళ్ల యువతికి ఆ దేశానికే చెందిన ఓ కంపెనీ డైరెక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఓ రిసార్ట్‌లో అతణ్ని చూసి మనసు పారేసుకుంది.
ఆ తర్వాత వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరోజు యువతిని రోమాంటిక్ వెకేషన్ కోసం తనతో రమ్మని పిలిచాడు సదరు వ్యక్తి.. తనను ప్రేమిస్తున్నానని చెప్పేందుకే పిలుస్తున్నాడనుకుని అతనితో కలిసి వెళ్లింది. వెకేషన్ కోసం వేరే దేశం వెళ్లిన వారిద్దరూ హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ఎంజాయ్ చేశారు.

అయితే యువతి ఊహించినట్టు అతను తన ప్రేమను వ్యక్తం చేయలేదు. దీంతో ఆమె అతనితో గొడవ పెట్టుకుంది. వెంటనే అతను ఆమె సామాన్లను తీసుకొని బయటకు విసిరేశాడు. తిరుగు ప్రయాణానికి డబ్బులు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఎన్నో కష్టాలు పడి ఇళ్లు చేరింది.
అంతటితో ఆ ప్రియుడు ఆమెను వదిలి పెట్టలేదు. తనతో డేటింగ్ చేసినన్ని రోజులు ఆమెను చాలా చోట్లకు తీసుకు వెళ్లానని, రెస్టారెంట్లు.. ఇలా ఎన్నో ప్రదేశాలకు తీసుకు వెళ్లి బాగా ఖర్చు పెట్టానని చెబుతూ కోర్టుకు వెల్లాడు. తనకు రూ.45 వేలకు పైగా చెల్లించాలని కోర్టుకెక్కాడు. తాను ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకోలేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications