పుతిన్‌పై విమర్శలు.. శవమైన మోడల్.. బాయ్‌ఫ్రెండ్ ఏం చెబుతున్నాడంటే
వ్లాదిమిర్ పుతిన్‌ను అగ్రరాజ్య అధినేత జో బైడెన్ కూడా నియంత అని అన్నారు. అతని చర్యల వల్లే ఉక్రెయిన్ యుద్దం జరుగుతుందని వివరించారు. అయితే పుతిన్ సొంత గడ్డ రష్యాలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. కొంత బయటకు వచ్చినా.. మరికొంత రావడం లేదు. అయితే రష్యాలో నిరసన చేస్తోన్న వారిపై ఉక్కుపాదం మోపారు.
ఉక్రెయిన్ పై దాడికి సంబంధించి వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యన్లలో చాలామంది వ్యతిరేకించారు.. వ్యతిరేకిస్తున్నారు కూడా. రష్యాలో పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. రష్యా మీడియాలోని ఓ వర్గం కూడా పుతిన్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. పుతిన్ పై ఇటీవల అదేపనిగా విమర్శలు కురిపించిన రష్యన్ మోడల్ భామ గ్రెట్టా వెడ్లెర్ శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో గుర్తించారు. గ్రెట్టాను తానే చంపినట్టు మాజీ బాయ్ ఫ్రెండ్ దిమిత్రీ కోరోవిన్ అంగీకరించాడు.

గ్రెట్టా కనిపించడం లేదంటూ 2021లో కేసు నమోదైంది. పుతిన్ ను 'సైకో' అంటూ గ్రెట్టా అప్పట్లో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. పుతిన్ పై వ్యాఖ్యలకు, ఆమె హత్యకు సంబంధం లేదని రష్యన్ మీడియా చెబుతోంది. మాజీ బాయ్ ఫ్రెండ్ అసూయతోనే గ్రెట్టాను అంతమొందించాడని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. ఓ హోటల్ గదిలో గ్రెట్టాను చంపిన దిమిత్రీ ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి ఓ కారులో వదిలేశాడు. ఏడాది తర్వాత ఆమె మృతదేహాన్ని గుర్తించడంతో హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కానీ ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో అంతా అదే అనుకుంటారు. అలా కొందరు అనుకునే ఛాన్స్ ఉంది. బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో అదే నిజం అనే వారు ఉన్నారు. మరికొందరు మేనెజ్ చేస్తున్నారెమో అని అంటుంటారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications