మంటల్లో చిక్కుకున్న రష్యా అణు జలాంతర్గామి

మాస్కో: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రష్యా జలాంతర్గామి మంటల్లో చిక్కుకుంది. మాస్కోకు ఉత్తరం వైపున జెజ్‌జోకా నౌకాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జలాంతర్గామిలో పేలుడు సంభవించలేదని, ప్రస్తుత ప్రమాదం వల్ల అణుధార్మిక కిరణాలు ఏర్పడలేదని అధికారులు స్పష్టం చేశారు.

రెండవ దశకు చెందిన ఆస్కార్‌ జలాంతర్గామిలో ఈ మంటలు వ్యాపించాయి. యాంటీ సబ్‌మెరైన్‌ క్షిపణులను ఈ జలాంతర్గామి మోసుకు వెళ్లగలదు. ప్రస్తుత పునర్నిర్మాణదశలో ఉన్న జలాంతర్గామిలో ఆయుధాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

 Russian nuclear submarine catches fire at shipyard

మరమ్మతు పనులకు ముందే జలాంతర్గామిలోని న్యూక్లియర్‌ రియాక్టర్‌ను తొలగించారు. ఈ సంఘటనలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం మంటలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది, కార్మికులు మంటల్లో చిక్కుకునే లోపలే బయపడ్డారని షిప్‌యార్డ్ అధికార ప్రతినిధి చెప్పారు.

సాయంత్రం చాలా సేపటికి మంటలను ఫైర్ ఫైటర్స్ అదుపు చేయగలిగాయి. స్థానిక ప్రజలకు గానీ పర్యావరణానికి గానీ ఈ ప్రమాదం వల్ల నష్టం లేదని అంటున్నారు. సోవియట్ పతనం తర్వాత రష్యాలో వరుసగా జలాంతర్గామి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+