కూలిన రష్యా డిఫెన్స్ విమానం: 16మందికి తీవ్రగాయాలు
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఐఎల్-18 విమానం సైబీరియాలో సోమవారం ఉదయం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 16మంది తీవ్రంగా గాయపడ్డారు.
సైబీరియా: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఐఎల్-18 విమానం సైబీరియాలో సోమవారం ఉదయం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాద సమయంలో విమానంలో 32మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. వాతావరణ ప్రతికూలతతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం మూడు ముక్కలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
విషయం తెలుసుకున్న రష్యా అధికారులు సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపించారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications