Rich politician: ప్రపంచంలో ధనిక పొలిటీషియన్ ఎవరో తెలుసా? ఆ దేశాధినేత యమ రిచ్ గురూ..
Putin: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. అయితే ఆయా దేశాలను పాలిస్తున్న రాజకీయ నాయకుల ఆస్తిపాస్తులు ఎంతో అనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది. ఆ విధంగా చూస్తే అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికా పాలకులను వెనక్కినెడుతూ ఇతర దేశాధినేతలు ముందుకు దూసుకుపోతున్నారు.
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వార్షిక వేతనం 1.18 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆయన ఆస్తుల విలువ మాత్రం చాలా భిన్నంగా ఉంది. 1990లలో అక్కడి ప్రధాన పెట్టుబడిదారు బిల్ బ్రౌడర్ దావాల ఆధారంగా పుతిన్ సంపద 200 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. 2017లో US సెనేట్ ముందు బ్రౌడర్ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు. నికర ఆస్తి విలువ పరంగా ఆయన భూమి మీద అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా తాను నమ్ముతున్నట్లు చెప్పాడు.

పుతిన్ అధికారిక ఆస్తులలో 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, 3 కార్లు ఉన్నాయి. 'పుతిన్స్ కంట్రీ కాటేజ్'గా పిలువబడే నల్ల సముద్రపు భవనం విలువ చాలా ఎక్కువగా ఉంటుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడి విగ్రహాలతో కూడిన పాలరాతి స్విమ్మింగ్ పూల్, యాంఫీథియేటర్, ఐస్ హాకీ రింక్, క్యాసినో మరియు నైట్‌క్లబ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం.
భవనం లోపల 5 లక్షల డాలర్లు విలువ చేసే డైనింగ్ రూమ్ ఫర్నిచర్ ఉంది. 850 డాలర్ల విలువైన ఇటాలియన్ టాయిలెట్ బ్రష్‌లను అక్కడ బాత్‌రూమ్‌లతో ఉంటాయని వినికిడి. దీని నిర్వహణ కోసం 40 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వారి వార్షిక వ్యయం 2 మిలియన్ డాలర్లు. ఇవికాక పుతిన్‌కు 19 ఇతర ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు మరియు హెలికాప్టర్లు ఉన్నాయి. 'ది ఫ్లయింగ్ క్రెమ్లిన్' అనే 716 మిలియన్ డాలర్ల విమానం ప్రత్యేకమైనదిగా చెబుతారు. అదనంగా 700 మిలియన్ డాలర్ల విలువైన షెహెరాజాడ్ అనే మెగా యాచ్ ఆయన సొంతం. లగ్జరీ వాచ్‌ల సేకరణ విలువ ఆయన వార్షిక జీతానికి 6 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications