ఉక్రెయిన్ వైపునకు రష్యా దళాలు: యుద్ధ మేఘాలు తొలగిపోలేదన్న అమెరికా, నాటో

వాషింగ్టన్: చర్చలకు అంగీకరించిననప్పటికీ.. ఉక్రెయిన్ వైపు రష్యా దళాలు కదులుతూనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోపాటు నాటో వర్గాలు పేర్కొన్నాయి. రష్యా చెబుతున్నదానికి.. జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదని తెలిపాయి. తాము ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

ఉక్రెయిన్‌పై పొంచివున్న యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని జో బైడెన్ వ్యాఖ్యానించారు. రష్యా దాడి చేయడానికి ఇప్పటికీ అవకాశాలు లేకపోలేదని అన్నారు. అదే జరిగితే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. అటువంటి సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యా దాదాపు 1.50 లక్షల దళాలను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిందని బైడెన్ తెలిపారు. రష్యా చెబుతున్న బలగాల విరమణ ధృవీకరించలేదని చెప్పారు.

Russian troops is still marching towards Ukraine border: US and NATO

రష్యా బలగాల ఉపసంహరణ మంచి నిర్ణయమే కానీ, తాము దాన్ని పరిశీలించలేదన్నారు. రష్యా దళాలు వాటి స్థావరాలు తిరిగి వెళ్తున్న విషయాన్ని తనిఖీ చేయలేదన్నారు. తమ విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం ఇప్పటికీ రష్యా దళాలు చాలా వరకూ ప్రమాదకరమైన రీతిలోనే కదులుతున్నాయని జో బైడెన్ పేర్కొన్నారు. అయినప్పటికీ రష్యా కోరినట్లు దౌత్య చర్చలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

కాగా, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్డ్‌తో చర్చలు ముగిసిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఐరోపాలో మరో యుద్ధాన్ని చూడాలని తాము కోరుకోవడం లేదని పుతిన్ పలుమార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, భద్రత విషయంలో మాస్కో భయాలను సీరియస్ గా తీసుకోవాలన్నారు. నవంబర్ నుంచి ఐరోపా ఖండంలో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.

Recommended Video

    Russia vs America : ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టే..! - Joe Biden | Oneindia Telugu

    ఈ నేపథ్యంలోనే రాష్యాతో జర్మనీ చర్చలు సానుకూల పరిణామాలకు దారితీసింది. ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీతో రష్యాకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్.. ఉక్రెయిన్ చేరుకుని చర్చలు ప్రారంభించగానే రష్యా కూడా తన నిర్ణయాల్లో మార్పులు చేసుకుంది. చర్చలకు ఓకే అంటూ పుతిన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ క్రమంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+