లైవ్‌షోలో రిజైన్ ప్రకటించి, బయటికొచ్చిన టివి యాంకర్
లండన్: ఉక్రెయన్‌కు వ్యతిరేకంగా రష్యా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా.. రష్యా ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న రష్యా టుడే(ఆర్టీ)కు చెందిన ఓ న్యూస్ యాంకర్ హఠాత్తుగా లైవ్ షో నుండి బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా అనుసరిస్తున్న విధానానికి నిరసనగానే తాను ఇలా వ్యవహరించినట్లు సదరు యాంకర్ చెప్పారు.
అంతకుముందు రోజు మరో యాంకర్ లైవ్ షోలోనే ఇదే టీవి ఛానల్లో రష్యా తీరును ఎండగట్టారు. మరుసటి రోజే మరో యాంకర్ లైవ్ షో నుండి బయటకు రావడం గమనార్హం.

లిజ్ వాల్ అనే న్యూస్ యాంకర్ రష్యా టుడే ఇంగ్లీషు వర్షన్ కరస్పాండెంట్. ఆమె వాషింగ్టన్ డిసి బ్యూరోలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఆమె లైవ్ షో నుండే రాజీనామాను ప్రకటించారు. పుతిన్ చర్యలను సరిగా లేవని చెబుతూ ఆమె లైవ్ షో నుండి బయటకు వచ్చారు.
పుతిన్ చర్యలను తాను సమర్థించలేనని, ఇలాంటి రష్యన్ నిధులతో నడుస్తున్న టీవి ఛానల్లో తాను పని చేసేందుకు సిద్ధంగా లేనని లిజ్ వాల్ ప్రకటించారు. రష్యా ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న చానల్‌లో తాను భాగం కావడాన్ని సహించలేనని పేర్కొన్నారు. అమెరికా జాతీయురాలిని అయినందుకు గర్విస్తున్నానని, తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications