పారిస్: మహిళా ఉగ్రవాది ఆత్మాహుతి, అపార్ట్‌మెంట్లో ఉగ్రవాది?
ప్యారిస్: ప్యారిస్ సమీపంలోని సెయింట్ డెనిస్‌లో బుధవారం మహిళా ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడింది. నాలుగు రోజుల క్రితం ముష్కరుల దాడి నేపథ్యంలో... ఫ్రాన్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. బుధవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.
ముగ్గురు చనిపోగా, ఓ మహిళ ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారని తెలుస్తోంది. సెయింట్ డెనిస్‌లో బుధవారం అనుమానిత ఉగ్రవాదులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.
మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, గత శుక్రవారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో దాడిలో పాల్గొన్న తొమ్మిది మంది ఉగ్రవాదుల్లో ఎనిమిది మంది ఆ రోజే మృతి చెందారు.

తొమ్మిదో ఉగ్రవాదిగా భావిస్తున్న సల్లాహ్ అబ్దెస్లామ్ పారిస్‌లోని సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావించారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్యారిస్ ఉత్తర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలోనే ఇద్దరు మృతి చెందగా, మరో మహిళా ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడింది.
అంతకుముందు, ప్యారిస్ సమీపంలోని సెయింట్ డెనిస్ బుధవారం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులే లక్ష్యంగా భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేసిన సెయింట్ డెనిస్‌లో ఏడుచోట్ల కాల్పులు, పేలుళ్ల శబ్దం వినిపించింది. ఈ నెల 13న ఐఎస్ ఉగ్రవాదులు పారిస్‌లో మారణ హోమం సృష్టించి 129 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగానే సెయింట్ డెనిస్‌లో పోలీసులు దాడులు చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications