అమెరికాలో కనిపించకుండా పోయిన స్టూడెంట్ సాకేత్.. విషాదాంతం

అమెరికాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఓ భారతీయ విద్యార్థి ఉదంతం.. విషాదాంతంగా ముగిసింది. ఆ విద్యార్థి మరణించాడు. అతని మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. దర్యాప్తు సాగిస్తోన్న స్థానిక పోలీసులు అతని మృతదేహం లభించినట్లు తెలిపింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

ఆ విద్యార్థి పేరు- సాకేత్ శ్రీనివాసయ్య. వయస్సు 22 సంవత్సరాలు. స్వరాష్ట్రం.. మన పొరుగునే ఉన్న కర్ణాటక. ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఉన్నత విద్యను అభ్యసిస్తోన్నాడు. కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. 2025లో ఐఐటీ మద్రాస్ నుండి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. బర్కెలీలో నివాసం ఉంటోన్నాడు.

Saketh Sreenivasaiah 22 University of California student Found Dead Indian Consulate Confirms

ఈ నెల 10వ తేదీన అతను అదృశ్యం అయ్యాడు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో బర్కెలీ పోలీసులు దర్యాప్తు సాగించారు. అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరిసారిగా మంగళవారం డ్వైట్ వేలోని 1700 బ్లాక్‌లో కనిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని నివాసం సమీపంలో శ్రీనివాసయ్య పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాక్‌ప్యాక్ గుర్తించారు. జాగా సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం వారికి లభించింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కాలిఫోర్నియా కాన్సులేట్ వెల్లడించింది. సాకేత్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. స్థానిక దర్యాప్తు అధికారులతో సమన్వయం చేసుకుంటోన్నామని, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. కాన్సులర్ అధికారులు అతని కుటుంబ సభ్యులతో నేరుగా సంప్రదింపులు జరుతున్నట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+