వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్ పైన వైట్ విడో సమంత ప్రేమగీతం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Samantha Lewthwaite wrote a poem on Laden
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిగా భావిస్తున్న సమంతా లేత్వయిటే ఓ పాట రాసి దానిని ఒసామా బిన్ లాడెన్‌కు అంకితం ఇచ్చింది. సమంత లేత్వయిటే 34 లైన్ల పాట రాసింది. దానిని ఆమె లాడెన్‌కు అంకితం ఇచ్చింది.

లాడెన్ పైన ఉన్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ సమంత రాసిన లేఖ బ్రిటన్‌లోని అంతర్జాతీయ పత్రికలలో ప్రధాన శీర్షికగా వచ్చింది. ఒసామాను తాను ఎంతగా ఇష్టపడిందో ఓ భావగీతాన్ని సమంత రచించిందని ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. సమంతా రాసిన లేఖ అంతా తప్పుల తడకగా ఉన్నా లాడెన్ పైన తకున్న ప్రేమను వ్యక్తపరిచిందని పేర్కొంది.

సమంత తన పాటలో ఒబామాను తన తండ్రిగా, సోదరుడిగా పేర్కొంది. అదే సమయంలో ముస్లింలు మేల్కొనాలని, వారు బలంగా తయారు కావాలని సూచించింది.

ఈ విషయంలో బిన్ లాడెన్‌ను ఆమె అభినందించింది. ఆయన ప్రారంభించిన దానిని కొనసాగించాలని కోరారు. ప్రాణం పోయే వరకు విజయాన్ని కోరుకుంటామని రాసింది.

కాగా, వైట్ విడో పేరుతో ప్రసిద్ధురాలైన సమంతా లేత్వయిటే ఇస్లాం మతాన్ని స్వీకరించింది. 2013 సెప్టెంబరులో నైరోబీలోని మాల్ పైన జరిగిన ఉగ్రవాద దాడి వెనుక సమంత హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

English summary

 White Widow Samantha Lewthwaite wrote a poem and dedicated to Osama Bin Laden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X