3 రోజుల చిన్నారిని కొరికి చంపిన పెంపుడు కుక్క
శాన్ డియోగో: అమెరికాలోని శాన్ డియాగో పట్టణంలో దారుణం జరిగింది. మూడు రోజుల పసిపాపను ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరిచి చంపేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నారు.
ఎన్‌బీసీ న్యూయార్క్‌కు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని శాన్ డియాగోలో స్టాన్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో నివసిస్తోన్న దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. బాబు వయసు మాడు రోజులు. గురువారం రాత్రి పూట దంపతులిద్దరూ టీవీ చూస్తుండగా ఆ కుక్క పాపతోపాటే రెండేళ్ల వయసున్న పెంపుడు కుక్క కూడా బెడ్‌పైనే ఉంది.

ఇంట్లో ఎంతో ముద్దుగా ఉండే కుక్కకు పేరు కూడా ఉంది. దాని పేరు పోలో. ఈ సమయంలో టీవీ చూస్తున్న చిన్నారి తల్లి ఒక్కసారిగా బలంగా దగ్గింది. దీంతో ఆ చప్పుడుకు కంగారుపడిన కుక్క గాబరాతో పసిబిడ్డను దారుణంగా కొరికడం ప్రారంభించింది.
దీంతో కుక్క నోటి నుంచి చిన్నారిని వేరు చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో శాన్ డియాగో జంతు నియంత్రణ అధికారులు కుక్కని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కుక్కకు రేబిస్ వ్యాధి సోకి చిన్నారి ప్రాణాలు తీసిందనే అనుమానంతో దానికి పిచ్చి తగ్గించి పది రోజులపాటు దాని నడవడికను పరీక్షించేందుకు ప్రత్యేక సెల్‌లో పోలీసులు వేశారు.












Click it and Unblock the Notifications