కుక్కంటే ప్రాణం: వెతికిచ్చిన వారికి ఈ అమ్మాయి భారీ ఆఫర్..అద్దెకు విమానం కూడా..!

శాన్‌ఫ్రాన్సిస్కో: కుక్కు విశ్వాసంకు మారుపేరు. ఒక ముద్ద అన్నం పెడితే చాలు... తోక ఊపుకుంటూ మనవెంటే తిరుగుతుంది. ఇంట్లో లేని సమయంలో కాపలాగా ఉంటుంది. ఒక్కసారి కుక్కకు అలవాటు పడితే దాని స్నేహాన్ని మరువలేం. చాలామంది ఇళ్లల్లో పెంపుడు కుక్కలు ఉండటం చూస్తుంటాం. ఆ కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చూస్తారు. అంతటి ప్రేమా అప్యాయతలు కనబరుస్తారు. ఇప్పుడు చదవబోయే కథలో కూడా ఓ అమ్మాయి తన కుక్కను ఎంతలా ప్రేమిస్తుందో అర్థమవుతుంది.

 కుక్కను వెతికి పట్టిస్తే 7వేల డాలర్లు బహుమానం

కుక్కను వెతికి పట్టిస్తే 7వేల డాలర్లు బహుమానం

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎమిలీ అనే అమ్మాయికి చెందిన కుక్క కనిపించకుండా పోయింది. ఓ గ్రాసరీ స్టోర్‌లోకి వెళ్లిన సమయంలో దీన్ని ఎవరో ఎత్తుకెళ్లారు. ఆస్ట్రేలియన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క కళ్లు నీలంరంగులో ఉంటాయట. తన కుక్కను తనకు వెతికి తెచ్చిచ్చిన వారికి భారీ బహుమానంను ప్రకటించింది. తన కుక్కను తెచ్చి ఇచ్చిన వారికి 7వేల డాలర్లను బహుమతిగా ప్రకటించింది. అంటే మన భారత కరెన్సీలో అది దాదాపు రూ. 5లక్షల రూపాయలు. అంతేకాదు ఈ కుక్కను తాను ఉంటున్న నగరంలో వెతికేందుకు ఓ చిన్నపాటి విమానంను కూడా ఎమిలీ అద్దెకు తీసుకుంది.

 కుక్కను వెతికేందుకు అద్దెకు విమానం

కుక్కను వెతికేందుకు అద్దెకు విమానం

కుక్కను కనుగొనేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ఎమిలీ ఒక ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక విమానం కోసం రోజుకు 1200 డాలర్లు అద్దె చెల్లిస్తోంది. అంతేకాదు తన వెబ్‌సైట్ పేరు కలిగి ఉన్న బ్యానర్‌ను విమానం నుంచి ఎగురువేస్తోంది. ఇక తన కుక్క జాక్సన్‌ను కనుగొనేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు ఎమిలీ చెప్పింది. అయితే ఈ ప్రయత్నంలో తాను ఒంటరినైపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా సహాయం చేస్తారా అంటూ వేడుకుంటోంది.

 ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్ ప్రారంభించిన ఎమిలీ

ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్ ప్రారంభించిన ఎమిలీ

ఇదిలా ఉంటే గ్రాసరీ స్టోర్ వద్ద ఉన్న సర్వేలియన్స్ కెమెరాను పరిశీలించగా ఒక వ్యక్తి దాన్ని అపహరించడం కనిపించింది. అయితే ఎవరా వ్యక్తి అనేది మాత్రం తెలియరాలేదు. తన ముఖానికి ముసుగు తొగడంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టలేకపోతోంది. ఆ కుక్క తనతో ఎంతో ప్రేమగా మెలిగేదని గుర్తుచేసుకుంటూ ఎమిలీ కంటతడి పెట్టింది. విమానం శాన్‌ఫ్రాన్సిస్కో ఓక్లాండ్ మీదుగా ఎగురుతుందని ఇలా రోజుకు రెండు గంటల పాటు ఎగురుతుందని చెప్పింది. ఇక కుక్క ఆచూకీ కనుగొనేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో గోఫౌండ్‌మి అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 7వేల డాలర్లు సేకరించింది. ఒకవేళ డబ్బులు మిగిలితే అది రాకెట్ డాగ్ రెస్క్యూకు ఇస్తానని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+