దేవయాని ఇష్యూ: 'సంగీత రిచర్డ్స్ సిఐఏ ఏజెంటేమో?'
ముంబై: తన కుమార్తె ఇంట్లో గతంలో పని చేసిన సంగీతా రిచర్డ్ సిఐఏ ఏజంట్ అయి ఉండవచ్చని భారత దౌత్యాధికారిణి దేవయాని తండ్రి ఉత్తమ్ అనుమానం వ్యక్తం చేశారు. దేవయానిపై మోపిన తప్పుడు కేసులను ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే తమ కుటుంబానికి న్యాయం లభిస్తుందన్నారు.
గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది ఒక కుట్ర కావచ్చని భారత ప్రభుత్వం సైతం భావిస్తోందని శనివారం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అతవాలేతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ అన్నారు. పరిస్థితులను బట్టి చూస్తే సంగీతా సిఐఏ ఏజంట్ అయి ఉండవచ్చనే అనుమానం కూడా కలుగుతోందని ఆయన అన్నారు.

దేవయానిపై పెట్టిన కేసు బోగస్ కేసని, సంగీత సిఐఏ ఏజంట్ అని అతవాలే అంటూ, ప్రభుత్వం ఈ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ ఖోబ్రగాదే నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం త్వరలోనే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తుందని కూడా చెప్పారు.
మరోవైపు దేవయాని వివాదం కొలిక్కి రాలేదు. దేవయానిపై చట్టప్రకారం చర్యలు తప్పవని చెబుతున్న అమెరికా ఆమె దౌత్యవేత్త హోదాపై భయపడాల్సిన పని లేదని చెబుతోంది. ఆమెను ఐరాసలో శాశ్వత దౌత్యాధికారిణిగా నియమించినా అంతకుముందే అభియోగాలు మోపినందు వల్ల అవి రద్దు కావని అమెరికా తెలిపింది. ఈ ప్రకటనను తగ్గించేందుకు మన విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సల్మాన్ ఖుర్షీద్‌తో చర్చించేందుకు అమెరికా విదేశామంగ మంత్రి జాన్ కెర్రీ సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా, దేవయాని విషయంలో భారత్ మీడియా అతిగా స్పందిస్తోందంటూ అమెరికా మీడియా ఆరోపిస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications