శని చంద్రుడిలో సముద్రపు గుర్తులు, లోతైన గుంతలు
వాషింగ్టన్: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న దాని చందమామ ఎన్సెలాడస్ పైన జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రో థర్మల్ చర్యలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి పైన సాగర గర్భాల్లో ఏర్పడే ప్రక్రియను ఇవి పోలి ఉన్నాయని చెప్పారు. లోతైన గుంతలను గుర్తించారు.
సముద్ర నీరు చొరబడి, శిలామయ క్రస్టు భాగంతో చర్య జరిపినప్పుడు హైడ్రో థర్మల్ చర్య ఏర్పడుతుంది. ఈ నీరు తిరిగి.. ఊష్ణ, ఖనిజపూరిత ద్రావణానికి పైకి ఎగిసి వస్తుంది. భూమీ మీద ఉన్న సముద్రాలలో ఇది సహజసిద్ధంగా జరుగుతుంటుంది.

ఎన్సెలాడస్ పైన కూడా ఈ ప్రక్రియ జరగడాన్ని బట్టి అక్కడ ఉపరితలం కింద సముద్రం ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం పైన అద్భుతమైన భౌగోళిక చర్యలు జరుగుతున్నాయనడానికి కూడా ఆస్కారం ఏర్పడిందన్నారు. దీనిని బట్టి అక్కడ జీవుల మనుగడకు అవసరమైన వాతావరణాలు ఉండొచ్చని స్పష్టమవుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికారి జాన్ గ్రన్స్‌ఫీల్డ్ చెప్పారు.












Click it and Unblock the Notifications