అత్యంత ప్రకాశవంతంగా శనిగ్రహం: ఈ రాత్రి నుంచే కనువిందు: ఏ దిశలో చూడాలి?
వాషింగ్టన్: విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని.. భూమికి చేరువగా రాబోతోంది. మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణ కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుంది. స్పేస్ బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లను వినియోగించడం ద్వారా శనిగ్రహాన్ని మరింత స్పష్టం చూడొచ్చు.
దీన్ని శాటర్న్ అప్పోజిషన్‌గా పిలుస్తారు. రెండు గ్రహాలు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకోవడాన్ని అప్పోజిషన్ అంటారు. శనిగ్రహం- సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంటుంది. సూర్యుడికి 886 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది శనిగ్రహం.

భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు- సూర్యుడితో శని గ్రహం మధ్య దూరం అంటే 746 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది. శనిగ్రహం స్పష్టంగా కనిపించడానికి.. దాని పరిమాణం, అందులో ఉండే వాయువులు ఓ కారణం. భూమి రేడియస్ 6,378.1 చదరపు కిలోమీటర్లు కాగా శనిగ్రహ విస్తీర్ణం 36,183.7 చదరపు కిలోమీటర్లు.
భూమితో పోల్చుకుంటే తొమ్మిది రెట్లు అధికం. జుపిటర్ తరహాలోనే శనిగ్రహం కూడా ప్రధానంగా హైడ్రోజన్, హీలియంతో నిండి ఉంటుంది. రాత్రి 8:30 గంటల తరువాత దక్షిణ ఆగ్నేయం వైపు శనిగ్రహాన్ని నేరుగా చూడొచ్చు. ఈ నెల 30వ తేదీన పౌర్ణమి చంద్రుడికి అత్యంత సమీపంలోనే కనిపిస్తుంది.

గ్రహాలపై పరిశోధన చేయాలనుకునే ఖగోళ శాస్త్రవేత్తలు.. దీన్ని అత్యంత అరుదుగా భావిస్తుంటారు. శనిగ్రహానికి సంబంధించిన వివరాలను సేకరించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదనేది వారి అభిప్రాయం. శనిగ్రహ లక్షణాలు, ఉపరితల వాతావరణం, దానికి ఉండే రింగ్స్ అప్పోజిషన్ సమయంలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications