Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైక్రోసాఫ్ట్‌ కొత్త ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల- సీఈవో బాధ్యతలు అదనం- అరుదైన అవకాశం

అంతర్జాతీయ యవనికపై అప్రతిహత విజయాలతో సాగిపోతున్న భారతీయుల జాబితాలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు మరో అరుదైన ఆఫర్ లభించింది. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్ధకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది. దీంతో ఇప్పటివరకూ మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవోగా వ్యవహరిస్తున్న సత్యనాదెళ్ల ఇప్పుడు మూడో ఛైర్మన్‌గా పదవి చేపట్టనున్నారు. సత్య కంటే ముందు మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్‌, జాన్‌ ధామ్సన్‌ ఛైర్మన్లుగా వ్యవహరించారు.

 మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

ఏడేళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతీయ అమెరికన్ సత్య నాదెళ్లకు ఇప్పుడు ఆ సంస్ధకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది. గతంలో బిల్‌గేట్స్‌, జాన్‌ థాంప్సన్‌ వంటి వారు పనిచేసిన ఛైర్మన్‌ పదవిలో 50 ఏళ్ల సత్య నాదెళ్ల ఇప్పుడు కూర్చోనున్నారు. దీంతో అమెరికాలో భారతీయుడికి దక్కిన ఓ అరుదైన గౌరవంగా దీన్ని అంతా అభివర్ణిస్తున్నారు. సీఈవో నుంచి ఛైర్మన్ పదవి దక్కించుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్‌పై సత్యనాదెళ్ల తన పట్టు నిరూపించుకున్నారు.

 మూడో ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

మూడో ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన మైక్రోసాఫ్ట్‌ సంస్ధకు సత్యనాదెళ్ల ఇప్పుడు మూడో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో మైక్రోసాఫ్ట్‌ సంస్ధలోనే మూడో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సత్యనాదెళ్ల ఇప్పుడు మూడో ఛైర్మన్ కూడా కానుండటం విశేషం. ఇప్పటివరకూ ఛైర్మన్‌ పదవిలో ఉన్న జాన్ థాంప్సన్‌ సత్య నాదెళ్ల రాకతో తిరిగి తన పాత పదవి అయిన ఇండిపెండెంట్ డైరెక్టర్‌ పదవిలోకి వెళ్లిపోనున్నారు.

 ఛైర్మన్‌తో పాటు సీఈవో బాధ్యతలు

ఛైర్మన్‌తో పాటు సీఈవో బాధ్యతలు

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ సంస్ధకు సీఈవోగా ఉన్న సత్యనాదెళ్లకు ఛైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా సంస్ధ మరిన్ని కీలక బాధ్యతల్ని అప్పగించింది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన సీఈవోతో పాటు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. వ్యూహాత్మక అవకాశాలు దక్కించుకునేందుకు, కీలక ఇబ్బందుల్ని గుర్తించేందుకు ఈ నియామకం దోహదపడుతుందని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

 సత్య నాదెళ్ల ప్రస్ధానం ఇదీ..

సత్య నాదెళ్ల ప్రస్ధానం ఇదీ..

2014లో స్టీవ్‌ బామర్‌ నుంచి సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా

గతంలో పర్సనల్‌ కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఉన్న మైక్రోసాఫ్ట్‌ను సత్యనాదెళ్ల తన ఎంట్రీ తర్వాత మొబైల్‌ రంగంలోకి కూడా విస్తరించారు. సంస్ధ బ్రాండింగ్‌ పెంచడంతో పాటు వేగంగా ఎదిగేందుకు తోడ్పడ్డారు. సత్య నాదెళ్ల సీఈవో అయ్యాక బిల్‌గేట్స్‌ సైతం ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని జాన్ థాంప్సన్‌కు బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పుడు సత్య నాదెళ్లపై నమ్మకంతో ఛైర్మన్‌, సీఈవో పదవుల్ని ఆయనకే అప్పగించారు.

Recommended Video

    Twitter కు చెక్ Netizens Trolls స్వేచ్ఛను హరించే ప్రయత్నం అంటూ | Koo App || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+