రాజును దేవుడితో పోల్చాడు....ఉద్యోగం పోగొట్టుకొన్నాడు

రాజు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కొదువ అనే నానుడి వినే ఉంటారు. అదే తరహ ఘటన ఒకటి తాజాగా దుబాయ్ లో చోటుచేసుకొంది.

మనామా:రాజు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కొదువ అనే నానుడి వినే ఉంటారు. అదే తరహ ఘటన ఒకటి తాజాగా దుబాయ్ లో చోటుచేసుకొంది.రాజును ప్రసన్నం చేసుకొనేందుకు గాను ఓ కాలమిస్టు అతిగా పొగడ్తలతో రాజును ముంచెత్తాడు. ఒకానొక దశలో రాజును దేవుడితో సమానమని రాశాడు. తనను దేవుడితో పోలుస్తూ ప్రశంసలు కురిపించిన ప్రముఖ కాలమిస్ట్ అల్ ఇనెంజీని సస్పెండ్ చేయాలని సౌదీ రాజు సాల్మన్ బిన్ అబ్ధుల్ అజీజ్ అల్ సౌద్ ఆదేశించారు.

 Saudi Arabia's King Salman orders newspaper to suspend columnist who praised him too much

రాజును అతిగా పొగిడారు ఆ కాలమిస్ట్. అంతేకాదు రాజును దేవుడితో సమానంటూ తన వ్యాసంలో రాశాడు. దేవుడి లక్షణాలున్నాయంటూ కీర్తించాడు. ఈ వ్యాసాన్ని చదవిని రాజు స్పందించారు. కాలమిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మనిషిని దేవుడితో పోల్చడం తప్పన్నారు. తప్పు చేసిన కాలమిస్ట్ ను వెంటనే తొలగించాలని పత్రికా యాజమాన్యానికి లేఖ రాశారు.ఇదే వ్యాసాన్ని వార్తగా ప్రసారం చేసిన అల్ జజీరా చానల్ పై కూడ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

అతిగా పొగడడం, దేవుళ్ళతో పోల్చడాన్ని సహించబోనని ఆయన వార్త సంస్థలను హెచ్చరించారు. మామూలుగా ప్రపంచదేశాల్లోని నేతల్లో చాలామందిని ఎంత పొగిడినా ఏమనరు. పొగడ్లతో వార్తలు రాయించుకొంటారు. కానీ, సౌదీ రాజు తీరు భిన్నంగా ఉండడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+